డ్రైవింగ్ లెసెన్స్ కోసం దరఖాస్తు చేశారా ? పరీక్ష ఉండకపోవచ్చు..ఎలా

డ్రైవింగ్ లెసెన్స్ కోసం దరఖాస్తు చేశారా ? పరీక్ష ఉండకపోవచ్చు..ఎలా

Applying for driving licence : డ్రైవింగ్ టెస్టు లేకుండా..లెసెన్స్ ఇచ్చే రోజులు రానున్నాయి. అయితే..ఇందుకు డ్రైవర్ గా ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే…డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ మేరకు డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ కోసం రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు మాత్రం తగిన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

దీనికి సంబంధించి పలు నిబంధనలను ముసాయిదా నోటఫికేషన్ లో పేర్కొన్నారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ధృవీకరిస్తే..టెస్టింగ్ లేకుండా..లెసెన్స్ లు జారీ చేయనున్నారు. ఇక్కడ..శిక్షణా కేంద్రాలకు పూర్తి స్వేచ్చను మాత్రం ఇవ్వరు. నిర్ధిష్టమైన అర్హతలు ఉండేలా ముసాయిదాను రూపొందించింది. సరికొత్తగా రూపొందించిన దీనిపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గత డిసెంబర్ లోనే ముసాయిదా రూపొందించింది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా..ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతున్నారు.

సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు ఉపకరిస్తుందని తద్వారా..రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే ధ్యేయంతో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాను ముందుకుతెచ్చింది. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ప్రతొక్కరి బాధ్యత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు.