Issues Whip to MLAs : మహారాష్ట్ర ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య విప్ వార్

మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా విప్ వార్ మొదలైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత బుధవారం పార్టీలోని రెండు వర్గాలు పోటాపోటీగా బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశాయి....

Issues Whip to MLAs : మహారాష్ట్ర ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య విప్ వార్

whip pawar

Maharastra Nationalist Congress Party : మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా విప్ వార్ మొదలైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత బుధవారం పార్టీలోని రెండు వర్గాలు పోటాపోటీగా బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తిరుగుబాటు నేత అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా బుధవారం నాడే తమ పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు విప్ జారీ చేశాయి. (Issues Whip to MLAs)

Ajit Pawar vs Sharad Pawar: మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభంలో స్పీకర్ ఎందుకంత కీలకమయ్యారు?

శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబి చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశానికి రావాలని పిలుపునిచ్చింది. (Sharad Pawars NCP issues whip to MLAs) అజిత్ పవార్ బృందం (Ajit camp also issues notice) ఉదయం 11 గంటలకు సబర్బన్ బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రాంగణంలో సమావేశం కానుంది. శరద్ పవార్ వర్గానికి చీఫ్ విప్‌గా పనిచేస్తున్న జితేంద్ర అవద్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్‌లను సమావేశానికి హాజరు కావాలని కోరారు. అదే సమయంలో తిరుగుబాటు నేత అజిత్ పవార్ తన వర్గానికి చీఫ్ విప్‌గా అనిల్ పాటిల్‌ను నియమించారు. తిరుగుబాటు వర్గం సమావేశాన్ని కూడా బుధవారమే ఏర్పాటు చేసింది.

Daggubati Purandheswari : అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి

విరుద్ధమైన వాదనల మధ్య ప్రతి వర్గానికి మద్ధతు ఇస్తున్న ఎమ్మెల్యేల వాస్తవ సంఖ్యపై ఈ సమావేశాల్లో వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. శివసేన-బీజేపీ క్యాబినెట్‌లో ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ తమకు 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అయితే శరద్ పవార్ శిబిరం దీనిని ఖండించింది. అజిత్ పవార్ వర్గానికి కేవలం 13 మంది ఎమ్మెల్యేల మద్ధతు మాత్రమే ఉందని శరద్ పవార్ వర్గీయులు పేర్కొన్నారు. ఏ వర్గానికి ఎంత మంది మద్ధతు ఉందనే విషయాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకరు తేల్చాల్సి ఉంది. దీంతో అందరి దృష్టి స్పీకరుపై పడింది.

Haryana : రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంటాయి…

288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో 53 మంది ఎమ్మెల్యేల్లో ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను అమలు చేయకుండా అజిత్ పవార్‌కు కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 36 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేఖపై సంతకం చేశారని ఆయన శిబిరం వాదించగా, సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీ మాత్రం 40 మందికి పైగా శాసనసభ్యులు అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు సీనియర్ పవార్‌కు విధేయులుగా ఉన్నారని చెబుతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే అజిత్ పవార్, మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. మొత్తం మీద బుధవారం నాటి ఎన్సీపీ వర్గాల పోటాపోటీ సమావేశాల్లోనే వారి బలాబలాలు ఏమిటో బయటపడనుంది.