Walnuts : వాల్ నట్స్ తింటే యవ్వనంగా ఉంటారా!….

వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది.

Walnuts : వాల్ నట్స్ తింటే యవ్వనంగా ఉంటారా!….

Walnuts

Walnuts : వాల్ నట్స్ కేవలం మెదడు ఆరోగ్యానికే కాదు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు, ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. మానవ శరీరం యుక్తవయస్సు ప్రారంభం నుండి జుట్టు నెరిసిపోవడం, చర్మంపై ముడతలు ఇలా మరెన్నో మార్పుల ద్వారా అనేక మార్పులను ఎదుర్కొంటుంది. మానవ శరీరంలో కాలనుగుణంగా సంబంవించే ఈ మార్పులను వాల్ నట్స్ తో నిరోధించవచ్చు.  అనారోగ్యకరమైన, అసమతుల్య ఆహారం, ధూమపానం అలాగే ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం ద్వారా మనం అనుకున్న దానికంటే ముందుగానే వృద్ధాప్యం బారిన పడవలసి వస్తుంది.

అయితే వాల్ నట్స్ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్‌నట్స్ అక్రోట్ తినటం వల్ల వృద్ధాప్యం ఛాయలు నెమ్మదించడానికి సహాయపడతాయి. వాల్‌నట్స్ లో పాలీఫెనాల్స్, విటమిన్ ఇ అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మానవ శరీరాన్ని వృద్ధాప్యం నుండి నిరోధిస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

వీటిల్లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి.  ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసే పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం చర్మానికి అవసరమైన కాంతిని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అలాగే ఎముకలు, కండరాల్లకు శక్తినిచ్చే కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.

వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు తీసుకోవటం వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి. గాఢంగా నిద్రపోవడానికి సహాయపడతాయి. వాల్ నట్స్ లో విటమిన్ ఇ మరియు ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తాయి.

అంతేకాకుండా వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతుంది. తద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు ప్రతిరోజు నానబెట్టిన వాల్ నట్స్ ను తినటం మంచిది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రెషన్ ను తగ్గిస్తాయి. అదనపు బరువు పెరగకుండా బరువు తగ్గటంలో సహాయపడతాయి.