Aryan Khan Case : సమీర్ వాంఖడేకు షాక్..ఆర్యన్ ఖాన్ కేసు నుంచి తొలగింపు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారి

Aryan Khan Case : సమీర్ వాంఖడేకు షాక్..ఆర్యన్ ఖాన్ కేసు నుంచి తొలగింపు

Sameer

Sameer Wankhede: బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారి సమీర్‌ వాంఖడే పై అధికారులు వేటు వేసారు. విచారణాధికారి స్థానం నుంచి సమీర్ వాంఖెడేను తొలగించి  NCB సెంట్రల్‌ జోన్‌కు బదిలీ చేశారు.

దీంతో ఇప్పటివరకు వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబై జోన్‌ విచారించిన ఆర్యన్‌ ఖాన్‌ తో పాటు మరో ఆరుగురి డ్రగ్స్ కేసులను.. ఇకపై సీనియర్ పోలీసు అధికారి సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)దర్యాప్తు చేపట్టనుంది. సంజయ్ సింగ్..1996 బ్యాచ్ ఒడిషా కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.

కాగా,ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. సమీర్ విచారిస్తున్న డ్రగ్స్ కేసులో మంత్రి మాలిక్ అల్లుడు కూడా ఇన్వాల్వ్ అయిన విషయం తెలిసిందే.

అయితే సమీర్ వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారని మాలిక్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఆయన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించారంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వాంఖడే మతంపైనా చర్చ జరిగింది.

మరోవైపు, ఆర్యన్‌ఖాన్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ అనే వ్యక్తి సైతం వాంఖడేపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్‌ జైళ్లో ఉన్న సమయంలో బెయిల్ కోసం ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలన్నారని చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు వాంఖెడేను ఈ కేసు విచారణ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఏంటీ

అక్టోబర్-2న ముంబైలో కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారులు అక్టోబర్-2 అర్ధరాత్రి దాడులు జరిపి అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.

అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు కనుగొనబడనప్పటికీ.. అతని వాట్సాప్ చాట్‌లు “అక్రమ మాదకద్రవ్యాల ఒప్పందాలు” మరియు విదేశీ డ్రగ్స్ వ్యాపార ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు రుజువు చేసినట్లు NCB కోర్టులో పేర్కొంది. నిందితుల్లో ఒకరు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేశాడని నిర్ధారించడానికి వాట్సాప్ చాట్‌లు సరిపోవని హైకోర్టు ఆ తర్వాత పేర్కొంది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌ ఖాన్ కు అక్టోబర్-28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ALSO READ US Defence Report : అరుణాచల్ ప్రదేశ్ లో 100 ఇళ్ల చైనా గ్రామం..యూఎస్ రిపోర్ట్