Assam Floods: అసోంను ముంచిన వరదలు.. ఎనిమిది మంది మృతి

అసోం రాష్ట్రాన్ని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తాయి. వరదల ప్రభావానికి రాష్ట్రంలో ఎనిమిది మంది మరణించారు. మొత్తం ఐదు లక్షల మందికి పైగా అసోం వాసులు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

Assam Floods: అసోంను ముంచిన వరదలు.. ఎనిమిది మంది మృతి

Assam Floods

Assam Floods: అసోం రాష్ట్రాన్ని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తాయి. వరదల ప్రభావానికి రాష్ట్రంలో ఎనిమిది మంది మరణించారు. మొత్తం ఐదు లక్షల మందికి పైగా అసోం వాసులు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది. వీళ్లందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

అయితే, వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, మరికొన్ని రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అసోంతోపాటు మిగతా ఈశాన్య రాష్ట్రాలు కూడా వరద ముంపునకు గురయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ మరో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫో‌న్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించాల్సిందిగా సీఎం, కేంద్ర మంత్రిని కోరారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది.

BJP National Meet: రేపటి నుంచి బీజేపీ జాతీయ సదస్సు.. వర్చువల్‌గా హాజరుకానున్న మోదీ

వరద ప్రభావిత జిల్లాల్లో ఇండియన్ ఆర్మీ, అసోం రైఫిల్స్ ఆధ్వర్యంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిమా హసావో జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అధికారులు అంటున్నారు. ఈ జిల్లాతోపాటు అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు నీట మునిగి పాడయ్యాయి. దీంతో రాష్ట్రంలో రవాణా పూర్తిగా స్తంభించింది. అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.