Corona effect : కామాఖ్యాదేవి ‘అంబుబాచి మేళా’..అమ్మవారి విశేషాలు

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుి కామాఖ్యాదేవి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంబుబాచి మేళాను కూడా రద్దు చేసింది అసోం ప్రభుత్వం.. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే కామాఖ్యాదేవి ఆలయంలో అంబుబాచి మేళ అద్భుతంగా జరిగేది. మేళా అయితే జరుగుతుంది గానీ..భక్తులకు మాత్రం అనుమతి లేదు. కానీ నిర్వాహకులు అతి కొద్దిమందితో ఈ మేళాను నిర్వహించనున్నారు.

Corona effect : కామాఖ్యాదేవి ‘అంబుబాచి మేళా’..అమ్మవారి విశేషాలు

Corona Effect

Without devotees Ambubachi mela : ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా వల్ల కరోనా కేసులు ఎంత భారీగా పెరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.ఈ ఘటన తర్వాత సంప్రదాయంగా జరిగే కొన్ని మేళాలు..యాత్రలు రద్దు అవుతున్నాయి. కారణం కరోనా మహమ్మరి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రద్దు చేయాల్సి వస్తోంది. ప్రతీ సంవత్సరం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వెళ్లి చార్ ధామ్ యాత్ర (యమునోత్రి, గంగోత్రి​, బద్రీనాథ్, కేదార్ నాథ్)కూడా రద్దు అయ్యింది.

ఈక్రమంలో అంబుబాచి మేళాను కూడా రద్దు చేసింది అసోం ప్రభుత్వం.. కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే కామాఖ్యాదేవి ఆలయంలో అంబుబాచి మేళ అద్భుతంగా జరిగేది. మేళా అయితే జరుగుతుంది గానీ..భక్తులకు మాత్రం అనుమతి లేదు. కానీ నిర్వాహకులు అతి కొద్దిమందితో ఈ మేళాను నిర్వహించనున్నారు.

అంబుబాచి మేళా విశేషాలు..
మహాకుంభమేళా గురించి తెలుసు. మహా కుంభమేళాను మించి మేళా బహుశా ఎక్కడా ఉండదేమో. కానీ దాదాపు అంతటి వైభవోపేతమైనదే ఈ ‘అంబుబాచి మేళా’. దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు.ఈశాన్య భారతంలో జరిగే ఈ మహాకుంభ్‌ మేళాకు భక్తులు పోటెత్తుతారు. సిద్ధులు తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. సాధువులు భక్తిపూర్వక విన్యాసాలు చేస్తారు. ఇదంతా కరోనా లేని రోజుల్లో అత్యంత ఆడంబరంగా..మహా సంబురంగా జరిగేది అంబుచాబు మేళా.

కామాఖ్యాదేవి ఆలయం మాతకు రుతుస్రావం..మహా వింత ఈ విశేషం..
సాధారణంగా మనుషులుగా పుట్టిన ఆడవారికి రుతుస్రావం (బహిష్టు, ముట్టు) జరుగుతుంది. కానీ అమ్మవార్లు కూడా ఆడవారే కదా..మరి అమ్మవార్లు బహిష్టు ఉంటారా?అంటే ఉంటారు. అదే మరి విశేషం. అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైనది అస్సోంలోని ‘కామాఖ్యాదేవి ఆలయం!’ అసోంలోని బ్రహ్మపుత్ర నదీతీరంలో.. గౌహతికి దగ్గరలో ఉందీ పుణ్యక్షేత్రం! ఈ ఆలయ విశిష్టత గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

కామాఖ్యాదేవి నెలలో మూడు రోజులు రుతుస్రావం జరుగుతుంది.. మృగశిర నక్షత్రం మూడో పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలోని మొదటి పాదం వరకు అమ్మవారి రుతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు.. అస్సామీయుల క్యాలెండర్‌ ప్రకారం అహార్‌ నెలలోని ఏడో రోజున ఈ అంబుబాచి మేళ ప్రారంభం అవుతుంది.

దేవి భాగవతంలో అమ్మవారి రుతుస్రావం ప్రత్యేక రోజుల ప్రస్తావన ఉంది. ఈ ప్రత్యేకమైన మూడు రోజుల్లో యోని శిలనుంచి ఎర్రని స్రావం వెలువడుతుంది.. శక్తిపీఠం ఎదురుగా ఉన్న సౌభాగ్య కుండంలోని జలమే ఈ ఎరుపురంగు నీరని చెబుతుంటారు.ఈ ఆలయంలో పది ప్రత్యేక దేవాలయాలు ఉంటాయి. ఈ పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి.

కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, బైరవి, చిన్నమస్తా, ధుమవతి, బగలముఖి, మాతంగి, కమల, వీటిలో త్రిపుర సుందరి, మాతంగి, కమల దేవాలయాలు ప్రక్కప్రక్కన ప్రధాన దేవాలయంలో ఉన్నాయి. మిగిలిన ఏడు దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి.సాధారణ హిందువులకు, తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలం.2015 జూలైలో భారత సుప్రీం కోర్టు ఈ దేవస్థాన యజమాన్యాన్ని కామాఖ్య దేబుట్టెర్ బోర్డు నుండి బోర్దేవ్రి సమాజ్ కు బదిలీ చేసింది.