Attack on BJP MP : బీజేపీ ఎంపీ రంజితా కోలి కారుపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి..

Attack On Mp Ranjitha
Attack on BJP MP Ranjitha koli car : బీజేపీ మహిళా ఎంపీ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఐరన్ రాడ్లుతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎంపీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ ఎంపీ రంజిత కోలి వెళ్తున్న కారుపై గురువారం జరిగిన ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను రంజిత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కరోనా బాధితులను పరామర్శించి..వారికి ధైర్యం చెప్పేందుకు రంజితా కోలి పలు ఆసుపత్రులను సందర్శించి..తిరిగి వస్తుండగా..గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్ వెళ్తుండగా..కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సడెన్ గా ఆమె కారుపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు.
ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎంపీ అనుచరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ప్రొటక్ట్ చేసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. అనంతరం వారిని డిశార్జ్ చేయటంతో సురక్షితంగా ఇంటికి తరలించారు. ఈ దాడిలో ఎంపీ రంజిత సురక్షితంగా బయటపడ్డారు. దాడి చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారరు. అర్థరాత్రి సమయంలో సడెన్ దాడి జరగడంతో నిందితులను గుర్తించలేకపోయానని తెలిపారు.