VJ Sunny : షూటింగ్ స్పాట్ లో బిగ్‌బాస్‌ సన్నీపై దాడి.. పోలీసులకి ఫిర్యాదు..

సన్నీ హరీష్ శంకర్ రాసిన కథ ఏటీఎం అనే సిరీస్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సిరీస్ షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సిరీస్ హైదరాబాద్‌లోని...............

VJ Sunny : షూటింగ్ స్పాట్ లో బిగ్‌బాస్‌ సన్నీపై దాడి.. పోలీసులకి ఫిర్యాదు..

Vj Sunny

VJ Sunny :  వీజే సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్ తో పేరు తెచ్చుకొని బిగ్‌బాస్‌ లో పాల్గొని గత సీజన్ బిగ్‌బాస్‌ విన్నర్ గా నిలిచాడు సన్నీ. దీంతో సన్నీకి మరింత ఫేమ్ రావడంతో పాటు పలు అవకాశాలు కూడా వరుసగా తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో, సిరీస్ లలో నటిస్తున్నాడు సన్నీ.

సన్నీ హరీష్ శంకర్ రాసిన కథ ఏటీఎం అనే సిరీస్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సిరీస్ షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సిరీస్ హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంది. అయితే ఇవాళ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్‌చల్‌ చేశాడు. అలాగే హీరో సన్నీతో గొడవకు దిగి అతడిపై దాడి కూడా చేశాడు.

Thaman : థమన్ పై మహేష్, రవితేజ ఫ్యాన్స్ ఫైర్..

దీంతో అక్కడ ఉన్న షూటింగ్ సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సన్నీపై దాడి జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చగా మారింది.