Deepotsav : అయోధ్య జిగేల్, ప్రపంచ రికార్డు

శ్రీరాముని జన్మభూమి అయోధ్య నగరం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించారు.

Deepotsav : అయోధ్య జిగేల్, ప్రపంచ రికార్డు

Aya

Ayodhya Deepotsav : శ్రీరాముని జన్మభూమి అయోధ్య నగరం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించారు. 2021, నవంబర్ 03వ తేదీ బుధవారం సరయు నదీతీరంలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో 12 లక్షల దీపాలతో పాటు లేజర్ షో ఏర్పాటు చేశారు. గతేడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును అధిగమించినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీపావళి పండుగ కంటే ఒకరోజు ముందు…దీపోత్సవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం!

9 లక్షల దీపాలతో పాటు అయోధ్య పట్టణం అంతా దీపాలు వెలిగించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలు నిర్వహిస్తున్నారు. రామ మందిరంతోపాటు నగరంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలతో మధ్యాహ్నం టేబులాక్స్‌తో కవాతు కూడా ప్లాన్ చేశారు.

Read More : Delhi Air Quality : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. ‘వెరీ పూర్’ ఇదే ఫస్ట్ టైం!

రామ మందిర నిర్మాణం వేగంగా జరగుతోంది. ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు. రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు మందిరానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగియనున్నట్లు తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. 2024 వరకు పూర్తి కానుంది. దీపోత్సవ్ సందర్భంగా పలు ప్రాంతాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముందుజాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.