Baba Ramdev : విలేకరిపై బాబా రామ్ దేవ్‌ ఫైర్.. నోరు మూసుకోమంటూ లైవ్‌లోనే అసహనం.. వీడియో వైరల్‌!

Baba Ramdev : దేశంలో చమురు ధరలపై గళమెత్తిన ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అసహనానికి లోనయ్యారు. లైవ్‌లోనే రిపోర్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు రామ్ దేవ్ బాబా

Baba Ramdev : విలేకరిపై బాబా రామ్ దేవ్‌ ఫైర్.. నోరు మూసుకోమంటూ లైవ్‌లోనే అసహనం.. వీడియో వైరల్‌!

Baba Ramdev

Baba Ramdev : దేశంలో చమురు ధరలపై గళమెత్తిన ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అసహనానికి లోనయ్యారు. చమురు ధరలపై గతంలో రామ్ దేవ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన మీడియా విలేకరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లైవ్‌లోనే రిపోర్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు రామ్ దేవ్ బాబా.. హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురును మీడియా విలేకరి చమురు ధరలపై ప్రశ్నించారు. దాంతో రామ్ దేవ్ బాబా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవును.. అయితే ఇప్పుడేం చేయమంటారు. ఈ ప్రశ్నలు అడగొద్దు.. నేనేమీ మీ కాంట్రాక్టర్ కాదు.. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నారు. ఇదే అంశంపై సదరు విలేఖరి ప్రశ్నించగా.. రామ్ దేవ్ బాబా సీరియస్ అయ్యారు. నేనే ఆ మాట అన్నాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు) ముందు నోరు మూసుకో.. మళ్లీ అడగొద్దు.. ఇలా మాట్లాడం అసలే మంచిది కాదు.. నువ్వు మీ తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉండాలన్నారు. 2014లో బాబా రామ్‌ దేవ్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. లీటర్‌కు రూ. 40 పెట్రోల్‌, రూ. 300 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. రామ్ దేవ్ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాబా రామ్‌ దేవ్‌ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో అందరూ కష్టపడి పనిచేయాలని ప్రజలను కోరారు. ‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదన్నారు. దేశాన్ని ఎలా పాలిస్తున్నారు.. జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. ద్రవ్యోల్బణం తగ్గాలన్నారు.


ఈ విషయంలో తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు కష్టపడి పనిచేయాలన్నారు. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను” అని అన్నారు. ఇదిలా ఉండగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. గత తొమ్మిది రోజులలో లీటరుకు రూ. 5లకు పైగా పెరిగాయి.

Read Also :  TTD : గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – బాబా రాందేవ్