TTD : గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – బాబా రాందేవ్
గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tirupati Go Maha Sammelanam : గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో పాల్గొన్న బాబా రాందేవ్ పై విధంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… టీటీడీ అవసరాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామని, తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీనిచ్చారు.
Read More : Refined couple : 45 వైన్ బాటిల్స్ దొంగిలించిన జంట
తెలుగు రాష్ట్రాల్లో 600కు పైగా ఉన్న గోశాలలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని సభలో వెల్లడించారు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహార్ రెడ్డి. త్వరలోనే గోశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో 3 లక్షల ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నామన్నారు.
Read More : Badvel Bypoll : వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది – బీజేపీ
టీటీడీకి ఎటా అవసరమయ్యే..6 వేల టన్నుల బియ్యం, 7 వేల టన్నుల శనగపప్పు, 6 వేల టన్నుల ఆవు నెయ్యి, ఇతర ముడిపదార్థాల ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల నుంచే కొనుగోలు చేస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.