Odisha : తల పంది ఆకారంలో…చర్మంపై పొలుసులు వింత శిశువు జననం
తల పంది ఆకారంలో..చర్మంపై పొలుసులతో ఉన్న ఓ వింత శిశువు జననం ఇవ్వడం చూసిన డాక్టర్లు షాక్ తిన్నారు.

Baby Girl
Baby Girl Born : తల పంది ఆకారంలో..చర్మంపై పొలుసులతో ఉన్న ఓ వింత శిశువు జననం ఇవ్వడం చూసిన డాక్టర్లు షాక్ తిన్నారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉండడం చాలా అరుదు అంటున్నారు వైద్యులు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. బట్టకుమార గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. అయితే..ఆమెకు పురిటినొప్పులు రావడంతో నగరంలోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకొచ్చారు.
వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా..2.40 కిలోల బరువుతో ఉన్న శిశువు జన్మనిచ్చింది. అయితే..పసి కందును చూసి షాక్ తిన్నారు వైద్యులు. తల పంది ఆకారంలో..చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లుగా కనిపించింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారని, ఇలాంటి శిశువు బంతికి ఉండడం చాలా అరుదు అని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Read More : Ap Government : నేడు పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ నగదు