Balakrishna : జగన్ తో టాలీవుడ్ మీటింగ్ పై బాలయ్య బాబు సెటైర్లు..

కరోనా అనంతరం ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి, సినిమాలకి అనేక రూల్స్ పెట్టి సినీ పరిశ్రమని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిశారు. టికెట్ రేట్లని పెంచమని..................

Balakrishna : జగన్ తో టాలీవుడ్ మీటింగ్ పై బాలయ్య బాబు సెటైర్లు..

Balakrishna :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఇక ఈ షోలో పూర్తిగా సినిమాలతో పాటు సినిమాలకి సంబంధించిన కాంట్రవర్సీల గురించి కూడా మాట్లాడారు. కరోనా అనంతరం ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి, సినిమాలకి అనేక రూల్స్ పెట్టి సినీ పరిశ్రమని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిశారు. టికెట్ రేట్లని పెంచమని, సినిమాలకి సంబంధించి కొన్ని ఫేవర్స్ చేయమని అడిగారు. దీనిపై ఒక రెండు, మూడు సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చలకు చిరంజీవి, రాజమౌళి, అలీ, పోసాని, ప్రభాస్, మహేష్, కొరటాల శివ.. పలువురు వెళ్లారు. అప్పుడు దీనిపై పెద్ద చర్చే జరిగింది.

Also Read………………….. Sankranthi Movies : సంక్రాంతి సినిమాల ఇష్యూ మీద మాట్లాడిన అగ్ర నిర్మాతలు..

దీని గురించి బాలయ్య బాబు షోలో మాట్లాడుతూ..కరోనా తర్వాత బెజవాడకి బ్యాచులు బ్యాచులు వెళ్లి మీటింగ్స్ పెట్టి వచ్చారు, ఏం జరిగింది, మీరు ఎందుకు వెళ్ళలేదు ఆ మీటింగ్స్ కి అని అడిగారు. దీనికి సురేష్ బాబు సమాధానమిస్తూ.. సినిమా బట్టి టికెట్ రేటు అంటే నాకు దాని మీద నమ్మకం లేదు. టికెట్ రేటు ఎంత ఉన్నా నాకు సమస్య లేదు, అందుకే నేను అసలు దాని గురించి పట్టించుకోలేదు, ఆ మీటింగ్స్ కి వెళ్ళలేదు అని చెప్పారు. ఇక అల్లు అరవింద్.. చిరంజీవి వెళ్లారు. ఆయన వెళ్లే ముందు రోజు మేమిద్దరం మాట్లాడుకున్నాం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎందుకు అని నేను వెళ్ళలేదు, చిరంజీవిని వెళ్లి రమ్మని చెప్పాను అని తెలిపారు.