Balakrishna : గాలా విత్ బాలా.. బాలయ్య ఆహా తెలుగు ఇండియన్ ఐడిల్స్ కి మామయ్య.. అదిరిపోయిన లుక్..

ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ ని తీసుకొస్తున్న ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో ఈ సారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 తీసుకొచ్చారు. ఇప్పటికే ఆడిషన్స్ చేసి, కొన్ని ఎపిసోడ్స్ చేసి వచ్చిన వాళ్లలో 12 మందిని ఫైనల్ చేశారు ఆహా నిర్వాహకులు..................

Balakrishna : గాలా విత్ బాలా.. బాలయ్య ఆహా తెలుగు ఇండియన్ ఐడిల్స్ కి మామయ్య.. అదిరిపోయిన లుక్..

Balakrishna special episode in Telugu Indian Idol Season 2 for Aha

Balakrishna :  బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఓ పక్క బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్స్ కొట్టాడు. మరోపక్క అన్ స్టాపబుల్ సీజన్ 1,2 లు గ్రాండ్ గా సక్సెస్ చేశాడు. ఇంకో పక్క యాడ్స్ కూడా మొదలుపెట్టేశాడు బాలయ్య. ఇలా అన్ని రకాలుగా గత సంవత్సర కాలం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు బాలయ్య బాబు. తాజాగా మరోసారి బాలకృష్ణ ఆహాలో సందడి చేయనున్నారు.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ ని తీసుకొస్తున్న ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో ఈ సారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 తీసుకొచ్చారు. ఇప్పటికే ఆడిషన్స్ చేసి, కొన్ని ఎపిసోడ్స్ చేసి వచ్చిన వాళ్లలో 12 మందిని ఫైనల్ చేశారు ఆహా నిర్వాహకులు. ఆ 12 మందితో ఈ సీజన్ నడవబోతుంది. అయితే ఆ 12 మందిని బాలకృష్ణ ఇంట్రడ్యూస్ చేయనున్నారు. బాలకృష్ణతో గాలా విత్ బాలా అనే స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు ఆహా నిర్వాహకులు.

ఈ ఎపిసోడ్ లో బాలయ్య హోస్ట్ గా ఆ 12 మందిని ప్రోగ్రాంలోకి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ అయిపోయింది. మార్చ్ 17,18న ఈ ఎపిసోడ్ ఆహాలో స్టీమ్ అవ్వనుంది. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ మైకేల్ జాక్సన్ లా స్పెషల్ డ్రెస్ వేసి ర్యాప్ పాడుతూ అదరగొట్టేశాడు. గాలా విత్ బాలా.. ఆహాలో ఇండియన్ ఐడల్ కి ఫైనల్ అయినా 12 మందికి ఈ బాలయ్య మామయ్య అంటూ ప్రోమోని బాలయ్యకు తగ్గట్టు డిజైన్ చేశారు. ఇక ఈ సీజన్ లో జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురి ఉండగా హేమచంద్ర ప్రోగ్రాంని హోస్ట్ చేస్తున్నాడు.

Rashmika Mandanna : జపనీస్ టాప్ ఫ్యాషన్ బ్రాండ్ కి ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన్న

దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోసారి బాలయ్య ఏ రేంజ్ లో అలరించనున్నాడో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ గా నిలిస్తే బాలయ్య సరికొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.