Pan, gutka Ban : పశ్చిమబెంగాల్‌ లో పాన్‌ మసాలా, గుట్కాపై నిషేధం

పాన్‌ మసాలా, గుట్కాను నిషేధించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కూడా గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధించింది.

Pan, gutka Ban : పశ్చిమబెంగాల్‌ లో పాన్‌ మసాలా, గుట్కాపై నిషేధం

Westbengal (1)

Ban on pan masala and gutka : పాన్‌ మసాలా, గుట్కాను నిషేధించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. గత నెల హర్యాణా ప్రభుత్వం.. గుట్కా, పాన్‌ మసాలా తయారీతో పాటు అమ్మకాలను నిషేధించగా… తాజాగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కూడా గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబర్ 7 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో సైతం గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. 2013లో ఖైనీ, పాన్ మసాలా గుట్కాలపై మమతా ప్రభుత్వం ఏడాది పాటు ఆంక్షలు విధించింది.

CM surprise visit to school : పాఠశాలల్లో సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు..షాక్ అయిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

దేశంలోని అనేక రాష్ట్రాల్లో నికోటిన్ కలిపిన గుట్కా లేదా పాన్ మసాలా అమ్మకాలపై ఆంక్షలు విదించారు. ఇప్పటివరకు ఉత్తరాఖండ్, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో ఏడాదిపాటు ఆంక్షలు విధించారు.