Banana : చర్మ,జుట్టు సౌందర్యానికి అరటిపండు మేలు!…

ముఖం పై గీతలు, పొట్టులేవటం వంటివాటి వల్ల ముఖం పొడిబారుతోంది. ముఖంలో తేమను నిలపడానికి అరటిపండ్లు ఉపయోగపడతాయి. ఈ పండులో ఉన్న విటమిన్‌ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది.

Banana : చర్మ,జుట్టు సౌందర్యానికి అరటిపండు మేలు!…

Banana

Banana : అరటిపండును రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు..శరీరానికి కావాల్సిన శక్తి అరటిపండు ద్వారా లభిస్తుంది. మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెరిటోనిస్ అనే పదార్ధం అరటిపండు తినటం ద్వారా లభిస్తుంది. అందాన్ని కాపాడు కోవడంలో కూడా అరటి పండు దోహదం చేస్తుంది.. చర్మ సమస్యలు మొటిమలు, ముఖం పొడిబారటం. ఈ సమస్యలను దూరం చేయడానికి అరటిపళ్ళు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే బి, ఎ, సి,ఎ విటమిన్లే కాక పొటాషి యం చర్మానికి, జుట్టుకు పోషకాలుగా దోహదపడతాయి. అరటి పండు వల్ల చర్మానికి , జుట్టుకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

మొటిమలు : బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదిమి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, 30నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కో వాలి. ఇన్ఫెక్షన్‌తో కూడిన మొటిమలలోని బాక్టీరియాను అరటి పండులోని పొటాషియం నశింపచేస్తుంది. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఇందులో ఉన్న బి విటమిన్‌ దురద వంటి వాటిని తగ్గిస్తుంది. చర్మం మంచి రంగులో కాంతివంతంగా మార్చటంలో దోహదం చేస్తుంది. వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే దురదలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పొడి చర్మం : ముఖం పై గీతలు, పొట్టులేవటం వంటివాటి వల్ల ముఖం పొడిబారుతోంది. ముఖంలో తేమను నిలపడానికి అరటిపండ్లు ఉపయోగపడతాయి. ఈ పండులో ఉన్న విటమిన్‌ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది. ఇక విటమిన్‌ ఇ పాడెైన చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది. విటమిన్‌ సి చర్మ కణాలలోని విషవాయువులను నిల్వ ఉంచకుండా చేయడంతోపాటు సన్నటి గీతలు ఏర్పడటం, వయసు పెరిగినట్టు కనిపించడాన్ని తగ్గిస్తుంది.

వయసు మీద పడినట్టు కనిపిస్తున్నామని భావించే వారు, ఒక పండిన అరటి పండును తీసుకుని దానిని మెత్తగా పేస్ట్‌లా చేసి, దానికి ఒక చెమ్చా తేనెను కలిపి ముఖానికి పట్టించుకుని 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఎండిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడిగి వేయాలి. తేనె చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక అరటిపండు ముఖాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మానికి అరటిపండ్లు బాగా ఉపయోగ పడతాయి ఎందుకంటే అవి సహజంగానే తేమను ఇస్తాయి.

జుట్టు పొడిబారడం : ఎండలో ఎక్కువగా తిరిగే వారికి, రంగుల వంటి రసాయనాలను ఉపయోగించేవారికి వాతావరణంలో వచ్చే మార్పులు హాని కలిగిస్తాయి. అరటిపళ్ళు పొడిబారిన జుట్టును మరమ్మత్తు చేసి సహజ స్థితికి తీసుకువస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం మాడుపై ఉండే బాక్టీరియానెైనా తొలగించి, ఆరోగ్యవంతమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఒక పండిన అరటిపండును తీసుకుని మాడుకు జుట్టుకు పట్టించాలి. ఇరవెై నిమిషాల పాటు ఉంచి తరువాత షాంపూతో స్నానం చేయాలి. దీనితో జుట్టుఆరోగ్యవంతంగా అవుతుంది.

అలాగే ఒక అరటిపండులో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ను కలిపి దానిని జుట్టుకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకుని 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో తలను కడుక్కొని షాంపూతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.