Telangana : బండి సంజయ్ అరెస్టు వ్యవహారం, ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఉన్నతాధికారులు

బండి సంజయ్‌ ఫిర్యాదు మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి‌లతో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణలకు...

Telangana : బండి సంజయ్ అరెస్టు వ్యవహారం, ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఉన్నతాధికారులు

Bandi Sanjay

Bandi Sanjay Arrest Issue : బండి సంజయ్‌ దీక్ష భగ్నం, అరెస్టుతో మొదలైన రాజకీయవేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రివిలేజ్‌ కమిటీ సమన్లు జారీ చేయగా.. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం వీరంతా కమిటీ ముందు హాజరవ్వానున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి‌ రవి గుప్తాలతో పాటుగా మరికొందరు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ జనవరి 22న నోటీసులు పంపింది. బండి సంజయ్‌ ఫిర్యాదు మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి‌లతో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణలకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. అంతేకాకుండా ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌లకు కూడా కమిటీ నోటీసులు జారీ చేసింది.

Read More : Muchintal : శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. నేటి కార్యక్రమాలు

ఎంపీగా ఉన్న తన విధులకు అడ్డు తగిలి, తనపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ గత నెలలో లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న పోలీసుల‌ కస్టడీ ఉన్నప్పుడే లోక్‌స‌భ‌ స్పీకర్‌కు లేఖ రాశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు తన ప‌ట్ల వ్యవహరించిన తీరును వివ‌రిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరైన బండి సంజయ్‌ తన వాదనలు వినిపించారు. ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటి ఎదుట ఎంపీ బండి సంజయ్ హాజరై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Read More : AP Employees : చలో విజయవాడ.. ఉద్యోగుల అరెస్టుల పర్వం

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 317 తెచ్చిందని, దీంతో.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ప్రివిలేజ్ కమిటి దృష్టికి తీసుకెళ్లారు‌. జీవో 317ను సవరించాలని 2022, జనవరి 2న తన కరీంనగర్‌లోని తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ దీక్షకు దిగితే.. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదులో తెలిపారు. తన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించరన్నారు. 2019లో ఒకసారి పోలీసులు తనపై దాడి చేశారని ఇది రెండోసారి అని ప్రివిలేజ్‌ కమిటికి వివరించారు.