Bandi Sanjay : పర్మినెంట్ ఎప్పుడు చేస్తారు? సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..

Bandi Sanjay : పర్మినెంట్ ఎప్పుడు చేస్తారు? సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అంశాల వారిగా సీఎంకు లేఖలు రాస్తున్నారు. సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. పరిష్కారం ఎప్పుడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులపై దాడులకు సంబంధించి ఇటీవలే సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్.. తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు.

సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ విషయమై లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్. సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడు ఉండబోరని, వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదు? అని అడిగారు.

Telangana : ‘మీరు నశం పెడితే..మేం జండూ బామ్ రాస్తాం’..కేసీఆర్ వ్యాఖ్యలకు బండి కౌంటర్..

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపుతోందని ఆరోపించారు. సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు పర్మినెంట్ చేస్తుందో ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ ను సైతం క్రమబద్దీకరించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

KTR : కేసీఆర్‌ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం- బీజేపీపై కేటీఆర్ ఫైర్

రెండు రోజుల క్రితమే బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. అలాగే, ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై నిత్యకృత్యంగా మారడం దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగిగా క్రమబద్ధీకరించి, పే స్కేల్ అమలు చేయాల్సిన భార్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.