Nalgonda : ఉద్రిక్తతలను పెంచిన బండి సంజయ్ టూర్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్‌ టూర్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్‌ను అడుగడుగునా టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి.

Nalgonda : ఉద్రిక్తతలను పెంచిన బండి సంజయ్ టూర్

Bandi

Bandi Sanjay Nalgonda Tour : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్‌ టూర్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్‌ను అడుగడుగునా టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. సాయంత్రం చిల్లేపల్లిలో దగ్గర ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బండి సంజయ్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన కాన్వాయ్‌ను చిల్లేపల్లి నుంచి పోలీసులు తరలించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Read More : Rachita Ram: ఫస్ట్ నైట్ గురించి స్టేట్మెంట్ ఇచ్చి వివాదాల్లో హీరోయిన్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉదయం నుంచి టీఆర్ఎస్‌  శ్రేణులు బండి సంజయ్‌ను ఎక్కడికక్కడ  అడ్డుకున్నాయి. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. మిర్యాలగూడలో టీఆర్ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.  బండి సంజయ్‌ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్తతల నడుమ సంజయ్ అర్జాలబావిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

Read More : Sabarimala Ayyappa: తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. రోజుకు 30వేల మందికి అనుమతి

రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటానన్న తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఎందుకు కొనడంలేదో చెప్పాలన్నారు బండి సంజయ్‌. కల్లాల్లోకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ గతంలో చెప్పలేదా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా కొనడం లేదన్నారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా…. ఆ నెపాన్ని కేంద్రం మీదకు నెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తక్షణమే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.