BCCI : హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ప్రకటించని బీసీసీఐ..హెచ్‌సీఏలో అంతర్గత గొడవలే కారణమా?

అంతర్గత కుమ్ములాటలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కొంపముంచాయా? క్రికెట్‌ కాకుండా నిత్యం విభేదాలతో బ్యాటింగ్‌ చేస్తోన్న HCA తగిన మూల్యం చెల్లుంచుకుంటోందా..?

BCCI : హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ప్రకటించని బీసీసీఐ..హెచ్‌సీఏలో అంతర్గత గొడవలే కారణమా?

Bcci

Internal conflicts in HCA : అంతర్గత కుమ్ములాటలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కొంపముంచాయా? క్రికెట్‌ కాకుండా నిత్యం విభేదాలతో బ్యాటింగ్‌ చేస్తోన్న HCA తగిన మూల్యం చెల్లుంచుకుంటోందా..? హెచ్‌సీఏ రాజకీయాల కారణంగా హైదరాబాద్‌లో ఇకపై మ్యాచ్‌లు జరుగవా? దీనిపై బీసీసీఐ ఆల్రెడీ హింట్‌ ఇచ్చేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.

దేశంలో మళ్లీ క్రికెట్‌ సందడి ఊపందుకోనుంది. టీ20ల మోత మోగనుంది. వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని విశాఖ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. హైదరాబాద్‌కు మాత్రం నిరాశే మిగిలింది. ఉప్పల్‌ స్టేడియానికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది.

BCCI Hikes: క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచిన బీసీసీఐ

ఆట కంటే అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతోనే క్రికెట్ కంట్రీలో కొంతకాలంగా ఫేమస్‌ అయిన HCAకు బీసీసీఐ గట్టి షాక్‌ ఇచ్చింది. భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్యలో సొంతగడ్డపై భారత్‌ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడనుంది. కానీ అందులో ఒక్క మ్యాచ్‌కూ హైదరాబాద్‌ వేదిక కాదు. దీనికి HCAలోని ఇంటర్నల్‌ గొడవలే కారణంగా తెలుస్తోంది.

రెండు వర్గాలుగా చీలిపోయిన HCA పాలకవర్గం విభేదాలతో ఇప్పటికే అబాసుపాలైంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫస్ట్‌ ఫేజ్‌ మ్యాచ్‌ల వేదికల్లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలోనూ నిరాశ తప్పలేదు. మ్యాచ్‌ల నిర్వహణలో ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్‌కు ఇప్పుడు ఇలాంటి దుస్థితి రావడంపై హైదరాబాద్‌ క్రికెట్ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

MS Dhoni : మెంటర్ గా ధోనీ..బీసీసీఐకి ఫిర్యాదు అందిందా ? ఎందుకు ?

పేరుకే క్రికెట్‌ అసోసియేషన్‌. ఏనాడు క్రికెట్‌ అభివృద్ధికి పాటుపడింది లేదు.. రూపాయి ఖర్చు చేసింది లేదు.. పైగా క్రికెట్‌ పేరుతో లక్షల రూపాయలు దోచుకోవడం. అది చేస్తా.. ఇది చేస్తా అంటూ రాజకీయ నాయకులను మించిన హామీలు కురిపించడం HCAకు అలవాటుగా మారింది. దేశంలో మరే క్రికెట్‌ బోర్డులోనూ ఇంత అవినీతి లేదనేది జగమెరిగిన సత్యం. కొంత కాలంగా సాధారణ రాజకీయాలను తలిపిస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాలిటిక్స్‌ రచ్చ… ఐదు నెలల క్రితమే బీసీసీఐ దృష్టికి వెళ్లింది.

అయితే HCA గొడవలపై బీసీసీఐ స్పందించలేదు. కానీ సైలెంట్‌గా యాక్షన్‌ మాత్రం తీసుకుంది. భాగ్యనగరంలో కరోనా తీవ్రత అంతగా లేకున్నా ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్‌కు ఛాన్స్‌ ఇవ్వలేదు. అయినా మన బోర్డు పెద్దల తీరు మారలేదు. మళ్లీ అవే గొడవలు.. అదే రచ్చ. వీటిని చూసిన బీసీసీఐకి చిరాకేసిందేమో.. 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా హైదరాబాద్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధపడలేదు.