Zebra line On Road : వర్షాకాలంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు బీ కేర్ ఫుల్ .. తెలుపురంగుపై ‘అడుగు’ జాగ్రత్త ఎందుకంటే..

ప్రతీ మనిషి ఏదో పనుల మీద బయటకు వెళుతుంటారు. బిజీ బిజీ జీవితంలో కూడా బయటకు వెళితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి..లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మరి ముఖ్యంగా రోడ్లు దాటే సమయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై జీబ్రాలైన్ దాటే సమయంలో జాగ్రత్త వహించాలి. ఈ జీబ్రాలైన్ లో తెలుపు రంగుపై అడుగు వేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Zebra line On Road : వర్షాకాలంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు బీ కేర్ ఫుల్ .. తెలుపురంగుపై ‘అడుగు’ జాగ్రత్త ఎందుకంటే..

Zebra line On Road

Zebra line : రోడ్ల (Roads)పై సిగ్నల్స్ వద్ద జీబ్రా లైన్స్ (Zebra line)ఉంటాయనే విషయం తెలిసిందే. నగర వాసులు బయటకు వస్తే రోడ్లపై జీబ్రాలైన్స్ (Zebra line)వద్ద సూచనలు పాటించి తీరాలి. జీబ్రాలైన్స్ వద్ద మాత్రమే పాదచారులు రోడ్లను దాటాల్సి ఉంటుంది. రెడ్ సిగ్నల్ (Red signal)పడగానే వాహనాలు ఆగుతాయి. పాదచారులు రోడ్లను దాటివెళ్లాకు తిరిగి వాహనాలు దూసుకెళ్లిపోతుంటాయి. జీబ్రాలైన్ దాటేటప్పుడు పాదచారులు చాలా జాగ్రత్తలు పాటించాలి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో జీబ్రాలైన్ క్రాస్ చేసేసమయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. వాహనాలను గమనిచటమే (కొంతమంది రెడ్ సిగ్నల్ పడినా వాహనాలపై దూసుకుపోతుంటారు) కాకుండా వర్షాకాలంలో జీబ్రాలైన్ దాటే సమయంలో తెల్లని రంగుపై ‘అడుగు’వేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలి..

Bengaluru Woman: ‘మరీ తెల్లగా ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేం’ కంపెనీ సమాధానానికి షాక్ అయిన యువతి

జీబ్రా లైన్స్ దాటే సమయంలో మరి ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే..జీబ్రా లైన్ లో ఉండే తెల్లటి రంగును పెయింట్ అనుకుంటారు. కానీ అది పెయింట్ కాదు . ఈ తెలుపు రంగు చాలా స్మూత్ గా ఉంటుంది. దీంతో తెల్లరంగుపై అడుగు పెట్టగానే జారుతుంది. ఎందుకంటే అది పెయింట్ కాదు. అది వైట్ సిరమిక్ పౌడర్ పెయింట్. అది ఉపయోగించినప్పుడు అధిక ఉష్ణోగ్రత ద్వారా బయటకు వస్తుందట. శీతలీకరణ (cooling)తరువాత అది నేలపై పటిష్టమవుతుంది. అంటే (strong)గట్టిపడుతుంది. అంతే కాకుండా వర్షం పడినప్పుడు జారుడు స్వభావాలన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వర్షాలు పడినప్పుడు జీబ్రా లైన్ దాటి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా..నిదానంగా వెళ్లాలి..పాదచారులే కాదు వాహనాలు వెళ్లే సమయంలో కూడా నిదానంగా వెళ్లటం మంచిది..

జారే స్వభావం కలిగిన ఈ తెలుపు రంగుపై కాలు వేయగానే జారుతుంది.దీంతో ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. సో..ఇప్పుడు తెలిసింది కదా..జీబ్రాలైన్ ను క్రాస్ చేసేటప్పుడు నిదానంగా వెళ్లండీ..ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండండి..