Bengaluru Woman: ‘మరీ తెల్లగా ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేం’ కంపెనీ సమాధానానికి షాక్ అయిన యువతి

ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండీ కూడా ఓ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేదో ఓ కంపెనీ. దానికి కారణం ఆమె తెల్లగా ఉందట..ఫెర్ స్కిన్ ఉన్న మీకు ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పిన కంపెనీ సమాధానానికి షాక్ అయ్యిందా అమ్మాయి.

Bengaluru Woman: ‘మరీ తెల్లగా ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేం’ కంపెనీ సమాధానానికి షాక్ అయిన యువతి

bengaluru woman denied job offer for fair skin

Bengaluru woman fair skin Job rejected :  ఉద్యోగం కోసం వెళ్లి అన్ని రౌండ్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ యువతికి కనీ వినీ ఎరుగని సమాధానం చెప్పి ఉద్యోగం ఇవ్వలేని చెప్పింది ఓ సంస్థ. మీరు టీమ్ లో అందరికంటే తెల్లగా ఉన్నారు కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పింది. ఆ సమాధానానికి సదరు యువతి షాక్ అయ్యింది. తనకు ఎదురైన ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా షేర్ చేయటంతో నెటిజన్లు సదరు కంపెనీని తిట్టిపోతున్నారు. ఉద్యోగం ఇవ్వటానికి దానికి కావాల్సిన టాలెంట్, ఎక్స్ పీరియెన్స్ చూడాలి గానీ తెల్లగా ఉన్నారని ఉద్యోగం ఇవ్వలేమని చెప్పటమేంటీ.. మరీ చోద్యం కాకపోతే అంటూ ఏకిపారేస్తున్నారు. బెంగళూరులో తెల్లగా ఉందని యువతికి ఉద్యోగం ఇవ్వని సదరు కంపెనీ నిర్వాకం కాస్తా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెల్లగా ఉండటం ఆ అమ్మాయి తప్పా..? అని ప్రశ్నిస్తున్నారు.

Cobra In Man Shirt : మందుబాబు షర్టులో దూరిన కింగ్ కోబ్రా .. వెన్నులో ఒణుకు పుట్టించే వీడియో

బెంగళూరులోని ఓ కంపెనీ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన చూసిన ‘ప్రతీక్ష జిక్కర్’ (Pratiksha Jichkar)అనే యువతి ఆ జాబ్‎కు అప్లికేషన్ పెట్టుకుంది. ఉద్యోగం సెలక్షన్ కోసం కంపెనీ పెట్టిన అన్ని టెస్టుల్లోనూ పాస్ అయ్యింది. మొదటి రెండు రైండ్లలోనూ బెస్ట్ అనిపించుకుంది. మూడో రౌండులో కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఇక ఉద్యోగం ఖాయం అని సంతోషపడింది. అన్ని టెస్టులు రైండ్లు పాస్ అయినా చివరికి కంపెనీ మాత్రం ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని వివరణ అడిగింది. దానికి సదరు కంపెనీ మీరు టీమ్ లో అందరి కంటే తెల్లగా ఉన్నారు అందుకే ఉద్యోగం ఇవ్వలేమని ఈమెయిల్ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె షాక్ అయ్యింది. తెల్లగా (fair skinv)ఉండటం వల్లే తనకు జాబ్ ఇవ్వడం లేదని అని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Kerala : రూ.250 పెట్టి లాటరీ టిక్కెట్‌‌ హరిత కర్మసేన మహిళలను వరించిన జాక్‌పాట్ .. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన శ్రామిక మహిళలు

దీంతో సదరు కంపెనీ ఆమెకు పంపించిన ఈ మెయిల్ చూసుకున్న ఆమె షాక్ అయ్యింది. ఈ మెయిల్  లో “మీ ప్రొఫైల్ చూశాము. జాబ్‎కి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి. కానీ ఈ జాబ్ మీకు ఇవ్వలేము. ఎందుకంటే మీరు మొత్తం టీమ్ లో ఉన్నవారికంటే తెల్లగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని రిజెక్టు చేస్తున్నాము” అని తెలిపింది. దీంతో పాపం ప్రతీక్ష జిక్కర్ డంగైపోయింది. ఇటువంటి కారణంతో కూడా అన్ని అర్హతలు ఉన్నా రిజక్ట్ చేస్తారా? అని షాక్ అయ్యింది. తనకు ఎదురైనా ఈ వింత అనుభవాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది. సదరు కంపెనీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి ఇలా రిజక్ట్ చేస్తారా..? అని తిట్టిపోస్తున్నారు.