Cobra In Man Shirt : మందుబాబు షర్టులో దూరిన కింగ్ కోబ్రా .. వెన్నులో ఒణుకు పుట్టించే వీడియో

ఓపాము మందుబాబు కిక్కు మొత్తం దింపేసింది. మందుబాబు చొక్కాలో దూరి జరజరమంటూ లోపల తెగ తిరిగేసింది మోస్ట్ డేజంరస్ కోబ్రా..దీంతో మందుబాబు తలకు ఎక్కిన కిక్కు మొత్తం దిగిపోయింది.

Cobra In Man Shirt : మందుబాబు షర్టులో దూరిన కింగ్ కోబ్రా .. వెన్నులో ఒణుకు పుట్టించే వీడియో

Cobra In Man Shirt

Cobra In man shirt Viral Video : మద్యం షాపు కనిపిస్తే మందుబాబులకు అడుగు ముందుకు పడదు. బాటిల్ కొనాల్సిందే. ఫుల్ గా తాగాల్సిందే. మందు మైకం తలకు ఎక్కితే ఎక్కడ పడిపోతామో..క్షేమంగా ఇంటికి వెళతామా..? లేదా అనేదో ధ్యాస ఉండదు. బాటిల్ కొనాలి..వెంటనే తాగేయాలి. లేదంటే పెదాలు తడారిపోతాయి. పగలు లేదు రాత్రి లేదు. కొన్నాక బాటిల్ ఖాళీ చేయాల్సిందే. తాగినవెంటనే తలకెక్కుతుంది. అది రోడ్డా…? పార్కా అనేది తెలికుండా ఎక్కడంటే అక్కడే పడిపోతారు. మత్తు దిగేదాకా అంతే..

అలా ఓ మందుబాబు ఫుల్ గా మందు కొట్టి ఓ పార్కులో పడిపోయాడు. ఒళ్లు తెలియనంత మైకలో ఫుల్ గా నిద్రపోయాడు. ఏం జరుగుతుందో కూడా ఒళ్లు తెలియని మత్తులో ఫుల్ గా నిద్రపోయాడు. కానీ ఓపాముకు అది తెలియదు కదా.. చక్కగా జరజరా పాక్కుంటు వచ్చిన ఓ తాచుపాము అదీ కూడా సాధారణ తాచుపాము కాదు కాటు వేస్తే క్షణాల్లో ప్రాణాలు తీసే కింగ్ కోబ్రా మందుబాబు వద్దకు వచ్చింది.అది దూరటానికి ఓ సందులా కనిపించిందో ఏమోగాని మందుబాబు చొక్కాలోకి దూరిపోయింది. కానీ బయటకు ఎలా రావాలో దానికి తెలియక జరజరా లోపలే తెగ తిరిగేస్తోంది.

ఈక్రమంలో మందుబాబుకు తలకు ఎక్కిన మద్యం మత్తు దిగిందో లేదా పాములోపల అటు ఇటు తిరుగుతుంటే మెలకువ వచ్చిందో ఏమోగానా లేచి కూర్చున్నాడు. లోపల ఏదో జరజరా పాకుతోందని గుర్తించాడు. వెంటనే తెలిసింది లోపల ఓ తాచుపాము ఉందని..అంతే ఒక్కసారిగా తలకెక్కిన మద్యం మత్తుత వదిలిపోయింది. గుండెల్లో గుబులు కాస్తా వెన్నులోకి పాకింది. వణికిపోయాడు. భయంతో అల్లాడిపోయాడు.భయంతో బిక్కచచ్చిపోయాడు.ఏ మాత్రం కదలకుండా ఉండిపోయాడు. షర్టు గుండీలు విప్పితే అది బయటకు పోతుంది కదాని భావించి షర్టు బటన్స్ విప్పబోయాడు.
Kerala : రూ.250 పెట్టి లాటరీ టిక్కెట్‌‌ హరిత కర్మసేన మహిళలను వరించిన జాక్‌పాట్ .. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన శ్రామిక మహిళలు

కానీ కదిలితే కాటు తప్పదు. అతని పరిస్థితి అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించాడు.అతనికి కూడా భయం వేసింది. కదిలితే పాము కాటు వేస్తుందని చెప్పి అతనే జాగ్రత్తతగా షర్టు బటన్స్ జాగ్రత్తగా విప్పాడు. కాసేపటికి అలా యత్నించేసరికి పాము కాస్తా మెల్లగా జారుకుంటు బయటకువచ్చి దాని దారిన అది వెళ్లిపోయింది.దీంతో మందుబాబు కిక్కు మొత్తం దిగిపోగా బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు.

పాము మందుబాబు చొక్కాలో ఉ‍న్నంతసేపు బాధితుడి భయంతో వణికిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు నిమిషాలు పాటు షర్ట్ లోపల అలా తిరిగిన పాము, మెల్లగా బయటకు తల పెట్టి.. అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. దీంతో అదృష్టం కొద్ది కింగ్‌ కోబ్రా కాటు నుంచి సదరు వ్యక్తి బయటపడ్డాడు. తలచుకుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టించే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండీ..

 

View this post on Instagram

 

A post shared by Gopi Maniar (@gopi.maniar)