Delhi Vijay Chowk : బీటింగ్ ది రిట్రీట్.. స్పెషల్ అట్రాక్షన్ డ్రోన్ షో

75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షో కార్యక్రమాలకు ప్రత్యేకంగా అనుమతినిచ్చారు...

Delhi Vijay Chowk : బీటింగ్ ది రిట్రీట్.. స్పెషల్ అట్రాక్షన్ డ్రోన్ షో

Drones

Beating Retreat Ceremony 2022 : ఢిల్లీ విజయ్ చౌక్ లో బీటింగ్ ది రిట్రీట్ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకతో గణతంత్ర వేడుకలు ముగియనున్న సంగతి తెలిసిందే. బీటింగ్ ది రిట్రీట్ పరేడ్ లో డ్రోన్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్వదేశీ సాంకేతికత ద్వారా రూపొందించబడిన 1,000 డ్రోన్‌లతో 10 నిమిషాల పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షో కార్యక్రమాలకు ప్రత్యేకంగా అనుమతినిచ్చారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు,  ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ బ్యాండ్‌లు వాయించే ఫుట్-ట్యాపింగ్ సంగీతంతో పాటు 26 ప్రదర్శనలు ఉండనున్నాయి.

Read More : NeoCoV Alert : ప్రపంచాన్ని కలవరపెట్టే ఈ కొత్త NeoCoV వైరస్‌పై ఆందోళనే వద్దు.. ఎందుకంటే? ఈ ఒరిజినల్ స్టడీ చదవాల్సిందే..!

మొదటగా మాస్డ్ బ్యాండ్ ‘వీర్ సైనిక్’ ట్యూన్ తో వేడుక ప్రారంభమైంది. పైప్స్ డ్రమ్స్ బ్యాండ్, CAPF బ్యాండ్, ఎయిర్ ఫోర్స్ బ్యాండ్, నావల్ బ్యాండ్, ఆర్మీ మిలిటరీ బ్యాండ్, మాస్డ్ బ్యాండ్‌లు  కూడా ఉండనున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అనేక కొత్త ట్యూన్‌లను రక్షణ శాఖ చేర్చింది. ‘కేరళ’, ‘హింద్ కి సేన’ , ‘ఏ మేరే వతన్‌కే లోగోన్’ ట్యూన్లు ఇందులో ఉన్నాయి. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్‌తో బీటింగ్ ది రిట్రీట్ పరేడ్ ముగియనుంది. ఇక డ్రోన్ ప్రదర్శనను ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్‌ డైనమిక్స్‌ స్టార్టప్ సంస్థ నిర్వహించింది. డ్రోన్ షోకు ఐఐటీ ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం అందించాయి. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానికి గుర్తుగా నిర్వహించిన ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో అందర్నీ ఆకట్టుకుంది. వేడుక ముగిసే ముందు నార్త్, సౌత్ బ్లాక్ గోడలపై దాదాపు 3-4 నిమిషాల నిడివి గల లేజర్ షో ప్రదర్శన నిర్వహించారు.