PM Modi : ప్రధాని షెడ్యూల్‌లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?

మహబూబ్‌నగర్‌లో జేపీ నడ్డా.. తుక్కుగూడలో అమిత్ షా.. బేగంపేట్‌లో.. ప్రధాని మోదీ. ఇలా.. ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా.. గల్లీ గల్లీలో రీసౌండ్ వచ్చేలా.. టీఆర్ఎస్‌పై బేస్ పెంచి మరీ వాయించేస్తున్నారు. నడ్డా, అమిత్ షా అంటే ఓకే. వాళ్లు.. రావాలనే సభకొచ్చారు. కావాలనే.. అధికార పార్టీని టార్గెట్ చేశారు. కానీ.. బేగంపేట్‌లో ప్రోగ్రాం మాత్రం అసలు.. పీఎం షెడ్యూల్‌లోనే లేదట. మరి.. అప్పటికప్పుడు ఆ సభను ఎలా వర్కవుట్ చేశారు. తెరవెనుక ఏం జరిగిందన్నదే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

PM Modi : ప్రధాని షెడ్యూల్‌లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?

Pm Modi Begumpet

MODI BJP JOSH : మహబూబ్‌నగర్‌లో జేపీ నడ్డా.. తుక్కుగూడలో అమిత్ షా.. బేగంపేట్‌లో.. ప్రధాని మోదీ. ఇలా.. ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా.. గల్లీ గల్లీలో రీసౌండ్ వచ్చేలా.. టీఆర్ఎస్‌పై బేస్ పెంచి మరీ వాయించేస్తున్నారు. నడ్డా, అమిత్ షా అంటే ఓకే. వాళ్లు.. రావాలనే సభకొచ్చారు. కావాలనే.. అధికార పార్టీని టార్గెట్ చేశారు. కానీ.. బేగంపేట్‌లో ప్రోగ్రాం మాత్రం అసలు.. పీఎం షెడ్యూల్‌లోనే లేదట. మరి.. అప్పటికప్పుడు ఆ సభను ఎలా వర్కవుట్ చేశారు. తెరవెనుక ఏం జరిగిందన్నదే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మోదీ హైదరాబాద్ టూర్‌లో.. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ దగ్గర సభ షెడ్యూల్‌లోనే లేదు. ఆయన ఐఎస్‌బీకి వచ్చి.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు హాజరై.. తిరిగి ఢిల్లీ వెళ్లిపోవాలి. ఇది.. మోదీ టూర్.. రియల్ షెడ్యూల్. కానీ.. బేగంపేట్ ఎయిర్‌పోర్టులో దిగి.. ఐఎస్‌బీకి చేరుకునే గ్యాప్‌లోనే.. బీజేపీ లీడర్లు ఓ సభను ప్లాన్ చేశారు. అందులో మోదీతో మాట్లాడించడం, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయించడం.. లాంటివన్నీ కొన్ని క్షణాల్లోనే జరిగిపోయాయ్. అసలు.. షెడ్యూల్‌లోనే లేని ప్రోగ్రాంను.. బీజేపీ నేతలు ఎలా పెట్టించారన్నదే.. ఇంట్రస్టింగ్ పాయింట్. దీని వెనుక.. పార్టీలోని కొందరు కీలక నేతలు బాగానే కష్టపడ్డారన్న టాక్ వినిపిస్తోంది.

స్టేట్ పార్టీ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నేత మురళీధర్ రావు లాంటి వాళ్లంతా.. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ దగ్గర.. ఓ వేదికను ఏర్పాటు చేయించడం, అక్కడికి మోదీని తీసుకొచ్చి మాట్లాడించడంలో సక్సెస్ అయ్యారు. నిజానికిది.. పీఎం షెడ్యూల్‌లో లేదు. కానీ.. ఈ ముగ్గురు నాయకులు.. పీఎంవోతో మాట్లాడి.. వాళ్లకు నచ్చజెప్పి.. ఏదో రకంగా మెప్పించి.. ఒప్పించి.. మొత్తానికి.. షెడ్యూల్‌లో పెట్టించేశారు. కానీ.. ఇది.. మోదీ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో దిగేంత వరకు.. బీజేపీ నేతలకే క్లారిటీ లేదు.

నిజానికి.. ప్రధాని మోదీ ఒంటిగంట.. 25 నిమిషాలకు హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే.. సరిగ్గా 11 గంటలకు.. 40 నిమిషాల ముందుగానే.. మోదీ బేగంపేట్ చేరుకుంటారని.. బీజేపీ నేతలకు సమాచారం అందింది. దీంతో.. అప్పటికే సిద్ధం చేసి ఉంచిన వేదిక నుంచి.. మోదీ ప్రసంగించడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు కమలనాథులు. మోదీ.. అలా ల్యాండ్ అవడం.. అక్కడి నుంచి నేరుగా సభా వేదిక మీదకు రావడం.. కేసీఆర్ పాలన, అవినీతి టార్గెట్‌గా ప్రసంగించడం అన్నీ.. వెంట వెంటనే జరిగిపోయాయ్. దీని వెనుక.. బయటకు కనిపించని బీజేపీ కీలక నేతల పాట్లు దాగున్నాయని.. కాషాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బండి సంజయ్ పాదయాత్ర, పాలమూరు, తుక్కుగూడలో వరుస బహిరంగ సభలు.. జేపీ నడ్డా, అమిత్ షా లాంటి.. బీజేపీ టాప్ మోస్ట్ లీడర్ల రాకతో.. బీజేపీ కార్యకర్తల్లో కొంత జోష్ వచ్చింది. ఈ సీక్వెన్స్‌లో.. అనుకోకుండా మోదీ హైదరాబాద్ టూర్ ఫిక్స్ అవడంతో.. ఈ సిచ్యువేషన్‌ని కూడా క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర బీజేపీలో జోష్ తగ్గకూడదంటే.. కచ్చితంగా మోదీ మాట్లాడాల్సిందేనని.. జాతీయ నాయకత్వానికి చెప్పి.. ఒప్పించారు. అందులో భాగంగానే.. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ దగ్గరే.. స్టేజ్ పెట్టి మరీ.. మోదీతో మాట్లాడించారు. పెద్దాయన కూడా.. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ స్పీచ్ దంచిపడేయంతో.. కార్యకర్తల్లో జోష్ డబులైపోయింది. మొత్తానికి.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మురళీధర్ రావు లాంటి నేతలు పడిన కష్టానికి.. ప్రతిఫలం దక్కిందని.. బీజేపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయ్.