Anand Deverakonda : ఫస్ట్ టైమ్ ఛార్టెడ్ ఫ్లైట్‌‌లో.. అమ్మ భయం.. నాన్న ధైర్యం..

ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే అమ్మ భయాన్ని, అమ్మకు నాన్న ధైర్యం చెప్పడాన్ని కెమెరాలో చిత్రీకరించారు ఆనంద్ దేవరకొండ..

Anand Deverakonda : ఫస్ట్ టైమ్ ఛార్టెడ్ ఫ్లైట్‌‌లో.. అమ్మ భయం.. నాన్న ధైర్యం..

Anand Deverakonda

Updated On : October 11, 2021 / 1:22 PM IST

Anand Deverakonda: ఫస్ట్ టైమ్ ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నాం అంటూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ టైమ్ ప్రైవేట్ జెట్‌లో జర్నీ చేస్తున్న ఫ్యామిలీ వీడియోను ఆనంద్ దేవరకొండ తన ఫోన్‌లో షూట్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే అమ్మ భయాన్ని, అమ్మకు నాన్న ధైర్యం చెప్పడాన్ని ఆనంద్ కెమెరాలో చిత్రీకరించారు.

Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు

ఫ్లైట్ జర్నీలో తమ్ముడి కొత్త సినిమా ‘పుష్పక విమానం’ ను ప్రమోట్ చేస్తూ విజయ్ దేవరకొండ వీడియోలో కనిపించారు. ‘అన్న ఎప్పుడూ బిజీనే’ అని ఆనంద్ దేవరకొండ అంటే, ‘నీ మూవీ ప్రమోషన్ చేస్తున్నా’ అంటూ విజయ్ రిప్లై ఇచ్చారు. ఇలా సరదాగా తిరుమలకు ప్రయాణించారు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు. వెంకటేశ్వరుడిని దర్శించుకుని ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ‘పుష్పక విమానం’ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

Vijay Deverakonda Family : శ్రీవారి సన్నిధిలో దేవరకొండ ఫ్యామిలీ

‘పుష్పక విమానం’ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. గీతా సైని నాయికగా నటించింది. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు ఆనంద్ దేవరకొండ.