Covid in Bengaluru : బెంగళూరులో మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
రోజు రోజుకు పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య చూస్తుంటే మరోసారి మహమ్మారి క్రమంగా పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు మాస్క్ లు తప్పనిసరి చేస్తున్నాయి.

Bengaluru Civic Agency Makes Masks A Must
covid cases increasing in Bengaluru : కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషపడినంత కాలం కూడా లేదు. మహమ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా తన ఉనికిని మరోసారి చూపిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య చూస్తుంటే మరోసారి మహమ్మారి క్రమంగా పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఫోర్త్ వేవ్ తప్పదా? అనే భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది.
దీంట్లో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కరోనా కొత్త కేసులు భారీగా నమోదు అవుతుండటంతో మాస్కులు తప్పని అని ప్రకటించింది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
ప్రస్తుతం రోజుకు 16,000 పరీక్షలు చేస్తుండగా దానిని 20,000 పెంచాలని.. ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4,000 మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరిరారని బెంగళూరు మహానగర్ పాలికె (BBMP) డాక్టర్ హరీష్ కుమార్ సోమవారం (జూన్ 6,2022) తెలిపారు.
అంతేకాకుండా..మాల్స్ తో పాటు సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారని తెలిపారు. ఈరోజు నుంచి నుంచి మార్షల్స్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు. కాగా..6వ తేదీన కర్ణాటకలో 300 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.