Hero Splendor Plus : 30 రోజుల్లోనే ఈ బైకును 2 లక్షల మందికిపైగా కొనేశారు.. ఫీచర్లు అదుర్స్.. మైలేజి, ధర ఎంతంటే?

భారతదేశంలో ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైలేజీతో పాటు పర్ఫార్మెన్స్ బాగుండే బైకులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Hero Splendor Plus : 30 రోజుల్లోనే ఈ బైకును 2 లక్షల మందికిపైగా కొనేశారు.. ఫీచర్లు అదుర్స్.. మైలేజి, ధర ఎంతంటే?

Hero Splendor Plus Sale

Hero Splendor Plus Sale : భారతదేశంలో ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైలేజీతో పాటు పర్ఫార్మెన్స్ బాగుండే బైకులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మంచి మైలేజీతో పాటు బైక్ డిజైన్, స్టైల్, లుక్ అన్నింటిని చూస్తున్నారు. అలాంటి టూ వీలర్ బైకుల్లో ఒకటి.. గత జనవరి నెలలో అత్యధిక స్థాయిలో కొనుగోలు చేశారు. కేవలం 30 రోజుల్లో రెండు లక్షల మందికి పైగా ఈ బైక్ కొనుగోలు చేశారట.. ఇంతకీ ఆ బైక్ పేరు ఏంటంటే.. Hero Splendor Plus.. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన బైకు కంపనీల్లో ఇదొకటి. ఈ బైక్ ధరతో పాటు మైలేజీ, స్టయిల్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండటంతోనే లక్షల మంది వినియోగదారులు ఈ బైకును కొనేందుకు ముందుకు వచ్చారు. ఈ హీరో Hero Splendor Plus బైకు లీటర్ పెట్రోలు పోస్తే.. 80.6 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

జనవరి నెలలో ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల డేటా ప్రకారం.. జనవరి 2022లో Hero Splendor Plus బైకు ధర అత్యధికంగా అమ్ముడైంది. హీరో స్ప్లెండర్‌కి (Hero MotoCorp) కంపెనీ సింగిల్ సిలిండర్ 97.2CC ఇంజిన్‌ను అందించింది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ బైకు ప్రారంభ ధర రూ. 65,610 (ఎక్స్-షోరూమ్) ఉండగా.. టాప్ వేరియంట్‌ బైకు ధర రూ.70,790 వరకు ఉంటుంది. జనవరి 2021లో కంపెనీ 2,25,383 యూనిట్లను అమ్మేసింది. అంటే.. జనవరి 2021 కన్నా జనవరి 2022 సేల్స్ తక్కువే.. ఈ బైకు కొనుగోలు చేసేవారి సంఖ్య లక్షల్లో ఉండటంతో దేశంలో ఎక్కువ మంది బైకు వినియోగదారులు ఇష్టపడే బైకుగా Hero Splendor Plus రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ బైకుకు సంబంధించి పూర్తి ఫీచర్లు, ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..

Hero Splendor Plus Sale (1)

Hero Splendor బైకు సింగిగల్ సిలిండఱ్ 97.2cc ఇంజిన్, ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వచ్చింది. ఈ ఇంజిన్ 8.02PS పవర్, 8.05 పీక్ టార్క్యూ, 4స్పీడ్ గేర్ బాక్సుతో వచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. డిస్క్ బ్రేక్ ఫ్రంట్ ఇచ్చారు. డ్రమ్ బ్రేక్ రియర్ వీల్ తో వచ్చింది. అలాగే ఈ బైకు Tubeless Tiresతో వచ్చింది.

రోడ్లపై రైడింగ్ చేసేటప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండేలా కంపెనీ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అందించింది. ఫ్రంట్ సైడ్‌లో డబుల్ క్రెడెల్ ఫ్రేమ్ అమర్చింది. రియర్ వెనుకభాగంలో ప్రీ అడ్జెస్ట్ చేసుకునేలా ట్విన్ షాక్స్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇక మైలేజీ విషయానికి వస్తే.. 80.6kmpl తో ARAI సర్టిఫైడ్ అయింది. ఇకపోతే ధర, వేరియంట్ల విషయానికి వస్తే.. దేశ మార్కెట్లో హీరో కంపెనీ ఈ బైకును నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. Hero Splendor ప్రారంభ ధర రూ. 65,610 (Ex-Showroom)తో అందుబాటులో ఉంది.

Read Also : Bajaj – Triumph new Bike: బజాజ్, ట్రయంఫ్ కలయికలో మొదటి బైక్ రెడీ, ఇక ప్రత్యర్థులతో యుద్ధమే