Bhala Thandanana: ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్.. భళా తందనాన ట్రైలర్

విభిన్నమైన కథలతో ఒక సినిమా రిలీజ్ అయ్యేలోపు మరో సినిమాను ప్రకటిస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ మధ్యనే రాజరాజ చోరగా ఆకట్టుకున్న శ్రీవిష్ణు మరో సినిమాను సిద్ధం చేశాడు.

Bhala Thandanana: ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్.. భళా తందనాన ట్రైలర్

Bhala Thandanana

Bhala Thandanana: విభిన్నమైన కథలతో ఒక సినిమా రిలీజ్ అయ్యేలోపు మరో సినిమాను ప్రకటిస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ మధ్యనే రాజరాజ చోరగా ఆకట్టుకున్న శ్రీవిష్ణు మరో సినిమాను సిద్ధం చేశాడు. అయితే.. ఇప్పటి వరకు భిన్నమైన కథలు.. నేచురాలిటీగా దగ్గరగా ఉండే సబ్జెక్టులతో సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో ఈసారి కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. భళా తందనానా అంటూ భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

Sree Vishnu : ఈ తరం తెలుగుని మర్చిపోతున్నారు.. నా సినిమా టైటిల్స్ తెలుగులోనే ఉంటాయి

బాణం మూవీ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఓ సినిమా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తవగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఆ మధ్య ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా శ్రీవిష్ణు లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వారమే ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన టీమ్ ఈరోజు ఆదివారమే ట్రైలర్ లాంచ్ చేసింది.

Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

ట్రైలర్ విషయానికి వస్తే.. హీరో, హీరోయిన్లు ఓ మీడియా సంస్థలో పనిచేస్తుండగా.. హీరోయిన్ కేథరిన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించింది. ఎన్నో రిస్కీ న్యూస్ కవర్ చేసిన హీరోయిన్ రూ.2000 కోట్ల హవాలా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా సమస్యలు చుట్టముట్టడం.. దాని నుండి హీరో, హీరోయిన్లు ఎలా తప్పించుకున్నారన్నది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఈ సినిమాలో కేజీఎఫ్​ ఫేమ్ గరుడ రామ్​ విలన్​గా నటించడం.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం వంటి ప్లస్ పాయింట్స్ తోడవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.