Bhatti Vikramarka: కరోనాతో అపోలో హాస్పిటల్‌లో భట్టి విక్రమార్క

కరోనా సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురై భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో ఆసుపత్రి..

Bhatti Vikramarka: కరోనాతో అపోలో హాస్పిటల్‌లో భట్టి విక్రమార్క

Bhatti Vikramarka (2)

Updated On : January 17, 2022 / 11:15 AM IST

Bhatti Vikramarka: కరోనా సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురై భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో ఆసుపత్రి వైద్యులు భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసర్లేదని స్వయంగా భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఇటీవల తనను కలిసిన వారు తప్పనిసరిగా Covid పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ధైర్యం చెప్పారు.

కార్యకర్తలు, నాయకులు కలవడానికి హైదరాబాద్ రావొద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను అందర్ని కలుస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి : నేను బ్యాంకాక్ బీచ్ లో స్క్రిప్ట్ రాయను.