Bheemla Nayak: వచ్చాడు భీమ్లా.. గ్రానైట్ బాంబ్‌లా.. రాప్‌సాంగ్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మల్టీస్టారర్‌గా వచ్చిన భారీ చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా, త్రివిక్రమ్ మాటలు రాయగా..

Bheemla Nayak: వచ్చాడు భీమ్లా.. గ్రానైట్ బాంబ్‌లా.. రాప్‌సాంగ్ వచ్చేసింది

Bheemla Nayak

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మల్టీస్టారర్‌గా వచ్చిన భారీ చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా, త్రివిక్రమ్ మాటలు రాయగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాగర్ చంద్ర తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది.

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

తాజాగా ఈ సినిమా మేకర్స్ నుండి ఓ రాప్ సాంగ్ విడుదలైంది. సాధారణంగా కొన్ని సినిమాలకి విడుదల తర్వాత కూడా హైప్ తీసుకురావడానికి ఆ సినిమాకి సంబంధించిన సీన్స్ లేదా పాటలు సినిమాలో జత చేయడం కానీ విడిగా యూట్యూబ్ లో రిలీజ్ చేయడం కానీ చేస్తారు. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి నుండి కూడా అలాంటి అప్డేట్ ఒకటి వదిలారు. భీమ్లా నాయక్ బ్యాక్ ఆన్ డ్యూటీ అంటూ ఓ రాప్ సాంగ్ రూపొందించి యూట్యూబ్ లో విడుదల చేశారు.

Bheemla Nayak: పవన్‌కు బాకీపడ్డా లెక్కను సరిచేసిన త్రివిక్రమ్

వచ్చాడు భీమ్లా.. గ్రానైట్ బాంబ్ లా అంటూ సాగే ఈ పాట మరోసారి పవర్ స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఇందులో సినిమాలోని కొన్ని సీన్లను తీసుకొని.. వాటితో పాటు కొందరు సింగర్స్, థమన్ విజువల్స్ తో కలిపి ఈ పాటను రూపొందించారు. సినిమాకి ముందు వచ్చే లిరికల్ సాంగ్స్ మాదిరిగానే ఈ పాటకి కూడా లిరిక్స్ కూడా వీడియోతో పాటు క్యారీ అవడం మరో హైలెట్ కావడంతో ఈ పాట కూడా రికార్డ్ వ్యూస్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.