Bheemla Nayak: వరల్డ్‌ వైడ్‌గా 3వేలకు పైగా థియేటర్లలో భీమ్లానాయక్‌ విడుదల

పవన్‌‌, రానా కాంబినేషన్‌లో వస్తున్న మల్టిస్టారర్‌ భీమ్లా నాయక్ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ అయితే పీక్స్‌లో ఉన్నాయి.

Bheemla Nayak: వరల్డ్‌ వైడ్‌గా 3వేలకు పైగా థియేటర్లలో భీమ్లానాయక్‌ విడుదల

Lala Bheemla Lyrical Video

Bheemla Nayak: పవన్‌‌, రానా కాంబినేషన్‌లో వస్తున్న మల్టిస్టారర్‌ భీమ్లా నాయక్ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ అయితే పీక్స్‌లో ఉన్నాయి. తెలుగు స్టేట్స్‌లోనే కాదు.. భారీ అంచనాల మధ్య భీమ్లా నాయక్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంచనాలకు మించి అన్నట్లు.. థియేటర్లలోకి భీమ్లా ఎంట్రీ ఇచ్చేశాడు. అర్థరాత్రి నుంచి థియేటర్ల దగ్గర సందడి మొదలయ్యింది. హైదరాబాద్‌లోని థియేటర్ల దగ్గర భీమ్లా నాయక్‌ మానియా కనిపిస్తోంది.

భీమ్లా నాయక్‌కు సంబంధించి ట్రైలర్‌, టీజర్‌లో కనిపించిన విజువల్స్‌, వినిపించిన డైలాగ్స్.. శాంపిల్ మాత్రమే..! థియేటర్‌లో చూడాల్సింది చాలా ఉందంటోంది భీమ్లా టీమ్‌. రావడం లేటు కావొచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా! బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది లెక్కా.. అంటున్నారు అభిమానులు. రికార్డుల ఊచకోత.. కలెక్షన్ల సునామీ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా థియేటర్లలో భీమ్లా నాయక్‌ రిలీజ్‌ అయ్యింది. నైజాం ఏరియాలో 400లకు పైగా సినిమా హాళ్లలో భీమ్లా నాయక్‌ సందడి చేస్తుంది.

ఇక సీడెడ్‌లో 300, ఆంధ్రాలో 650లకు పైగా థియేటరల్లో భీమ్లా నాయక్‌ సినిమా వేయనున్నారు. ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి.. 1350 థియేటర్లలో కనిపిస్తోండగా.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 350కి పైగా థియేటర్లలో భీమ్లా నాయక్‌ సినిమా రిలీజ్‌ అవుతోంది. ఓవర్సీస్‌లో 700కు పైగా థియేటర్లలో విడుదలవుతోంది.