Bholaa Shankar : ‘జాం జాం జజ్జనక’ అంటూ భోళా శంకర్ పార్టీ మొదలైపోయింది..
చిరంజీవి భోళా శంకర్ నుంచి పార్టీ సాంగ్ ప్రోమో వచ్చేసింది. 'జాం జాం జజ్జనక' అంటూ భోళా శంకర్ పార్టీ మొదలుపెట్టేశాడు.

Bholaa Shankar Party song Jam Jam Jajjanaka Promo out
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కలయికలో వస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుంది. చిరుకి చెల్లిగా మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తుంది. ఇక కీర్తికి జోడిగా అక్కినేని హీరో సుశాంత్ కీర్తికి కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
Ileana : తొమ్మిదో నెల గర్భంతో ఇలియానా.. చాలా అలసటగా ఉందంటూ పోస్ట్..!
ఈ మూవీ నుంచి ఇప్పటికే ఒక సాంగ్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రాబోతుంది. ఈ సినిమాలోని ‘జాం జాం జజ్జనక’ అనే సాగే పార్టీ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో చిరు, తమన్నా, కీర్తి, సుశాంత్ అదిరే స్టెప్పులు వేయనున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పూర్తి సాంగ్ ని జులై 11న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Salaar : కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..?
కాగా ఈ మూవీ తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్ వస్తుంది. ఆగష్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే చిరంజీవి ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసేశాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి ఆ అంచనాలకు మెహర్ రమేష్ ఎంత వరకు న్యాయం చేస్తాడో చూడాలి.