ఆర్బీఐ హెచ్చరికలు : మొబైల్ నెంబర్ లాంటి టోల్ ఫ్రీ నెంబర్ తో ఫోన్ చేస్తారు జాగ్రత్త

ఆర్బీఐ హెచ్చరికలు : మొబైల్ నెంబర్ లాంటి టోల్ ఫ్రీ నెంబర్ తో ఫోన్ చేస్తారు జాగ్రత్త

RBI cautions : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)..ఓ హెచ్చరిక చేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచిస్తోంది. కొన్ని రోజులుగా..ఆన్ లైన్ యాప్ మోసాలు, ఫోన్లలో జరుగుతున్న చీటర్స్ గురించి అలర్ట్ గా ఉండాలని ఖాతాదారులను అప్రమత్తం చేసింది. మొబైల్ నెంబర్ల ద్వారా కొత్త మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉపయోగించే టోల్ ఫ్రీ నెంబర్ల మాదిరిగానే..కొత్త నెంబర్లు తీసుకుని కాల్ చేసి మోసం చేస్తున్నారని వివరించింది.

కొత్త నెంబర్ల నుంచి కాల్ చేస్తే..కాలర్ ఐడెంటీఫికేషన్ యాప్స్ కూడా బ్యాంకు పేర్లనే చూపిస్తాయని, దీంతో యూజర్లు మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉదాహరణకు 1800 123 1234 అని అనుకుంటే..మోసగాళ్లు 800 123 1234 నెంబర్ తీసుకుని కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్స్ లో సూపర్ వైజ్డ్, ఎంటీటీ టోల్ ఫ్రీ నెంబర్ గా రిజిస్టర్ చేసుకుంటారు. దీంతో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చినా..అది బ్యాంకు నుంచి వచ్చినట్లు భావిస్తారు. ఖాతాను యాక్సెస్ చేయడానికి డెబిట్ / కార్డు ఆధారాలు, వినియోగదారుడి పేరు, OTP మొదలైన ఇతర వివరాలు అందించాలని కోరుతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ను ధృవీకరించాలని, ఖాతాకు సంబంధించిన వివరాలను ఎవరికీ చెప్పకపోవడం శ్రేయస్కరమంటున్నారు.