BiggBoss 6 Day 70 : ఆదివారం మరో ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన నాగ్..

ఇక నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరికి వాసంతి, మెరీనా మాత్రమే మిగలగా వీరిద్దరిలో............

BiggBoss 6 Day 70 : ఆదివారం మరో ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన నాగ్..

BiggBoss 6 Day 70 vasanthi eliminated from BiggBoss

BiggBoss 6 Day 70 :  బిగ్‌బాస్ లో శనివారం నాడు బాలాదిత్యని ఎలిమినేటి చేసి అందరికి షాకిచ్చాడు నాగార్జున. ఇక సండే ఫండే ఎపిసోడ్ లాగే జరిపించారు. కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించాడు నాగ్. ఇందుకోసం రేవంత్‌, ఇనయ, మెరీనా, రాజ్‌, ఫైమాలను A టీమ్‌గా, కీర్తి, శ్రీహాన్‌, రోహిత్‌, వాసంతి, శ్రీసత్యలను B టీమ్‌గా విడగొట్టాడు నాగ్‌. ఒక సినిమా పేరు చూపించి దాన్ని బొమ్మగా గీస్తే అవతలి టీం వాళ్ళు దాన్ని గెస్ చేయాలి. ఈ గేమ్ సరదాగా సాగింది. మధ్య మధ్యలో కంటెస్టెంట్స్ డ్యాన్సులతో రెచ్చిపోయారు.

అలాగే సెలబ్రిటీల చిన్నప్పటి బొమ్మలు చూపించి వాళ్లెవరో కనుక్కోమన్నారు. తప్పు చెప్పినోళ్లకి వెరైటీ పనిష్మెంట్స్ ఇచ్చారు. ఈ ఫన్నీ పనిష్మెంట్స్ కంటెస్టెంట్స్ చేస్తుంటే అందరూ నవ్వుకున్నారు. రెండు గేమ్స్ లోను B టీమ్‌పై A టీమ్‌ గెలవగా A టీమ్‌కు గిఫ్ట్‌ హ్యాంపర్‌ ఇచ్చారు.

BiggBoss 6 Day 69 : శనివారమే ఎలిమినేషన్.. ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్న బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ అందరికి క్లాస్ పీకిన నాగార్జున..

ఇక నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరికి వాసంతి, మెరీనా మాత్రమే మిగలగా వీరిద్దరిలో వాసంతిని ఎలిమినేట్ చేశారు. వాసంతికి ఇంటి సభ్యులంతా సెండ్ ఆఫ్ ఇచ్చారు. వాసంతి స్టేజిపైకి వచ్చాక హౌజ్ లో ఫేక్‌ ఫ్రెండ్స్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ చెప్పమని నాగార్జున అడగగా మెరీనా, ఇనయ, రేవంత్‌, కీర్తి తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్‌ ఫేక్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పింది. దీంతో ఆదివారం నాడు మరో ఎలిమినేషన్ అయిపోయింది.