Akhanda 2 : అఖండ 2 రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్‌..! ఆ రోజే రిలీజ్..!

Akhanda 2 :నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న అఖండ -2 చిత్రం రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్ అయింది.

Akhanda 2 : అఖండ 2 రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్‌..! ఆ రోజే రిలీజ్..!

Nandamuri Balakrishna Akhanda 2 Release Date fix

Updated On : December 9, 2025 / 1:01 PM IST

Akhanda 2 : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ‌ న‌టిస్తున్న అఖండ -2 చిత్రం రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్ అయింది. ఈ చిత్ర విడుద‌ల‌కు మ‌ద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు నిర్మాత‌లు స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌ ఒక‌రోజు ముందుగానే అంటే డిసెంబ‌ర్ 11నే ప్రీమియ‌ర్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.

వాస్త‌వానికి ఈ చిత్రం డిసెంబ‌ర్ 5నే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. 14 రీల్స్, ఈరోస్ సంస్థల మధ్య వున్న ఆర్ధిక వివాదం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి. ఈ విష‌యాన్ని కోర్టుకు నివేదించ‌గా.. రిలీజ్‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Prabhas : జపాన్‌లో భూకంపం.. ఆందోళ‌న‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌.. ద‌ర్శ‌కుడు మారుతి ఏం చెప్పాడంటే?

ఈ చిత్రానికి బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంయుక్త క‌థానాయిక‌. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తుండ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే భారీ అంచ‌నాలే ఉన్నాయి.