Prabhas : జపాన్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్.. దర్శకుడు మారుతి ఏం చెప్పాడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ) ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు.
Earthquake in japan Prabhas is safe says Director maruthi
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అయితే.. సోమవారం జపాన్‌ను భూకంపం వణికింది. ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేల్ పై దీని తీవ్రత 7.6గా నమోదైంది. హొక్కైడో ద్వీపానికి, అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ క్రమంలో అక్కడ సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఎలా ఉన్నారో అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.
ఇటీవల ప్రభాస్ (Prabhas) నటించిన బాహుబలి రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని జపాన్‌లో డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. జపాన్‌లో భూకంపం రావడంతో ఆయన ఎలా ఉన్నారో అన్న టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Jr NTR : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్..
Spoke to Darling he is not in Tokyo and doing safe no worries 👍
— Director Maruthi (@DirectorMaruthi) December 9, 2025
దీనిపై దర్శకుడు మారుతి స్పందించారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన టోక్యోలో లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అక్కరలేదు.’ అని మారుతి తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
