Bigg Boss : బిగ్ బాస్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన కంటెస్టెంట్

తాజాగా ఈ 15వ సీజన్లో అపశృతి చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయినందుకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అఫ్సానా ఖాన్‌ ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది.

Bigg Boss : బిగ్ బాస్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన కంటెస్టెంట్

Afsana

Updated On : November 11, 2021 / 1:35 PM IST

Bigg Boss :  హిందీలో ఎప్పట్నుంచో బిగ్‌బాస్‌ కొనసాగుతుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుని 15వ సీజన్‌ మొదలు పెట్టింది. తాజాగా ఈ 15వ సీజన్లో అపశృతి చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయినందుకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అఫ్సానా ఖాన్‌ ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది.

Prabhas : ‘బాహుబలి’ అడుగు పెట్టి 19 ఏళ్ళు

ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ 15వ సీజన్లో హౌస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఉమర్‌ రియాజ్‌ ఇచ్చిన టాస్క్ ప్రకారం కంటెస్టెంట్స్ లో కరణ్‌ కుంద్రా, నిషాంత్‌ భట్‌, తేజస్వి ప్రకాశ్‌, అఫ్సానా ఖాన్‌లలో ముగ్గురిని మాత్రమే వీఐపీ టికెట్‌ కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే రియాజ్‌.. అఫ్సానా ఖాన్‌ను ఈ రేసు నుంచి తప్పించి మిగిలిన ముగ్గురిని సెలక్ట్‌ చేశాడు.

Cool Jayanth : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మృతి

దీంతో అఫ్సానా బాధపడుతూ.. అందరూ తనను టార్గెట్‌ చేస్తున్నారని, నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడుస్తున్నారని సీరియస్ అయింది. ఒకపక్క అరుస్తూనే వెంటనే అక్కడున్న కత్తిని తీసుకొని చెయ్యి కోసుకోడానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న రియాజ్‌, కరణ్‌ ఇది చూసి వెంటనే ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.