Prabhas : ‘బాహుబలి’ అడుగు పెట్టి 19 ఏళ్ళు

తెలుగు వాళ్ళు గర్వపడేలా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ హీరోగా పరిచయమై నేటికి 19 సంవత్సరాలవుతుంది. హీరోగా 'ఈశ్వర్‌' సినిమాతో ప్రభాస్‌ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2002 నవంబర్‌ 11న

Prabhas : ‘బాహుబలి’ అడుగు పెట్టి 19 ఏళ్ళు

Prabhas

Prabhas :  యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌… బాక్సాఫీస్‌ ‘బాహుబలి’.. ‘బాహుబలి’ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని అందనంత ఎత్తుకి తీసుకెళ్తున్న హీరో. ఇదంతా ఇప్పుడు కానీ గతంలో ఓ మాములు హీరో, వరుస ప్లాప్స్ కూడా చూసిన హీరో. పెద్దనాన్న కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌, ఇప్పుడు కృష్ణంరాజు `ప్రభాస్‌ మా అబ్బాయి` అని గర్వంగా చెప్పుకునే రేంజ్‌కు ఎదిగాడు. ఓ టాలీవుడ్‌ హీరోపై ఎంటైర్‌ ఇండియన్‌ సినిమా దాదాపు వెయ్యికోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి సినిమాలు తీయడం ఇదే తొలిసారి. ఇదే ఆఖరు కూడా కావొచ్చు. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ ని ఇప్పట్లో ఎవరూ అందుకునేలా లేరు.

Cool Jayanth : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మృతి

మన తెలుగు వాళ్ళు గర్వపడేలా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ హీరోగా పరిచయమై నేటికి 19 సంవత్సరాలవుతుంది. హీరోగా ‘ఈశ్వర్‌’ సినిమాతో ప్రభాస్‌ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2002 నవంబర్‌ 11న ‘ఈశ్వర్’ సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో మాస్ హీరోగా నటించి ప్రూవ్‌ చేసుకున్నాడు. కాకపోతే ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత ‘రాఘవేంద్ర’తో పర్వాలేదనిపించినా, వర్షం సినిమాతో భారీ విజయం సాధించి హీరోగా నిలదొక్కుకున్నాడు. వర్షం సినిమాతో క్లాస్, మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

Anasuya : దానికోసం గుండు కొట్టించుకోడానికి కూడా రెడీ : అనసూయ

ఆ తర్వాత వెంటవెంటనే ‘అడవిరాముడు’, ‘చక్రం’ సినిమాలు ఫెయిల్ అయినా నిరుత్సాహపడలేదు. ఇక రాజమౌళితో కలిసి ‘ఛత్రపతి’గా బాక్సాఫీస్‌ వద్ద చెలరేగిపోయాడు. ఈ సినిమాతో కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి మాస్ హీరోగా మారాడు. వరుసగా ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’ సినిమాలతో ప్రయోగాలు చేశాడు. ఇక ‘బిల్లా’ సినిమాలో స్టైలిష్‌ హీరోగా అదరగొట్టాడు. ‘ఏక్ నిరంజన్’తో పక్కా మాస్ క్యారెక్టర్ చేశాడు. ‘డార్లింగ్‌’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’తో వరుస హిట్స్ కొట్టి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు, లేడీ ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు. ‘రెబల్‌’ లాంటి స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్లాప్ టాక్ తెచ్చుకొని కూడా భారీ కలెక్షన్స్ సాధించాడు ప్రభాస్. ఇక ‘మిర్చి’ చిత్రంతో ఒకవైపు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను, మరో వైపు మాస్‌ ఆడియెన్స్‌ను మెప్పించి హిట్ కొట్టాడు.

Khiladi : ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’ ఆట షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక ‘బాహుబలి 1, 2’తో వేల కోట్లలో కలెక్షన్స్ సాధించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి, తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ను పెంచేసాడు. ‘బాహుబలి’ తర్వాత చిన్న సినిమాలు ప్రభాస్ కు సెట్ అవ్వవని అర్థమై వరుసగా అన్ని భారీ బడ్జెట్స్ తో పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ‘బాహుబలి’ తర్వాత హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘సాహో’ అంటూ వచ్చాడు. తెలుగులో పర్వాలేదనిపించినా బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది ఈ సినిమా. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ని చూసి ఆయన ప్రతి సినిమాకి వందల కోట్ల బడ్జెట్స్ పెడుతున్నారు. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా పెట్టిన బడ్జెట్ కి లాభాలు తెప్పించగలడు అంటూ ‘సాహో’ సినిమాతో ప్రూవ్ చేశాడు ప్రభాస్.

Akhil Sarthak : మీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కోరిక.. తండ్రికి కార్ కొనిచ్చిన అఖిల్ సార్థక్

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రాధేశ్యామ్’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, బాలీవుడ్ లో ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు కె’, సందీప్ వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుల విలువ దాదాపు 1000 కోట్లపైనే. 25 సినిమాల వరకు ప్రభాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి భారీ సినిమాలు ఎన్నో చేసి ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్లాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రభాస్ నిజంగానే హాలీవుడ్ కి సరిపోయే కటౌట్ అని అభిమానులు అంటున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియాంకకి సపోర్ట్ ఇవ్వం : తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 19 ఏళ్ళు అయి సినిమా పరంగా ఎన్నో సాధించినా, ఎంతోమంది అభిమానులని సంపాదించినా ఇంకా పెళ్లి చేసుకోలేదు అని కొంతమంది భాదపడుతున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్యలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో చూడాలి.