BiggBoss 7 : ఈ సారి కూడా బిగ్‌బాస్ హోస్ట్ ఆయనే.. కంటెస్టెంట్స్ ఎవరు? ఇప్పటికే ప్రోమో షూట్ కూడా పూర్తి..

షో ఎప్పుడు మొదలవుతుందా? ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

BiggBoss 7 : ఈ సారి కూడా బిగ్‌బాస్ హోస్ట్ ఆయనే.. కంటెస్టెంట్స్ ఎవరు? ఇప్పటికే ప్రోమో షూట్ కూడా పూర్తి..

BiggBoss Season 7 Telugu Host and Contestants and Program Details

Updated On : July 13, 2023 / 11:24 AM IST

BiggBoss 7 Telugu :  తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది అంటూ ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు. ‘స్టార్ మా’లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. గత నాలుగు సీజన్ల నుంచి ఈ షోకి నాగార్జునే(Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షో ఎప్పుడు మొదలవుతుందా? ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ ప్రోమో షూట్ కూడా నాగార్జునతో పూర్తి చేసేశారని సమాచారం. ఈ షూట్ నుంచి నాగార్జునకి సంబంధించిన ఓ ఫోటో కూడా బయటకి వచ్చింది. అయితే అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి.

Ananya Pandey : బాయ్ ఫ్రెండ్‌తో అనన్య పాండే టూర్.. ఆ హీరోతోనే రిలేషన్?

ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 7 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్… అమరదీప్ – తేజస్విని జంట, సీరియల్ ఆర్టిస్ట్ శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ షో మొదలయ్యేవరకు కూడా ఫైనల్ కంటెస్టెంట్స్ పేర్లు అధికారికంగా బయటకు రావు.

ఇక ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సెట్ వర్క్ పూర్తవుతుంది. ఆగస్టు మొదట్లో ప్రోమో రిలీజ్ చేసి, సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రారంభమవుతుందని సమాచారం.