BiggBoss Sohel : నడిసముద్రంలో పడిపోయిన బిగ్‌బాస్ సోహెల్.. కాలికి గాయం!

బిగ్‌బాస్‌ సోహెల్ నటిస్తున్న తాజా చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. ఈ నెల 30న విడుదలకు సిద్దమవుతుంది. ఇక సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గిర చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాడు సోహెల్. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ర్ తో కలిసి వెరైటీ ప్రమోషన్స్ కి తెర లేపాడు.

BiggBoss Sohel : నడిసముద్రంలో పడిపోయిన బిగ్‌బాస్ సోహెల్.. కాలికి గాయం!

BiggBoss Sohel accidentally fell in sea

Updated On : December 24, 2022 / 7:37 AM IST

BiggBoss Sohel : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌తో పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు చాలా మంది నటీనటులు. ఆ క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో సోహెల్ ఒకడు. బిగ్‌బాస్‌ టైటిల్ అందుకోలేక పోయిన సినిమా ఛాన్సులు మాత్రం అందిపుచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ, షూటింగ్‌లు జరుపుకుంటున్నాడు.

Lucky Lakshman: సెన్సార్ పనులు ముగించుకున్న లక్కీ లక్ష్మణ్

ప్రస్తుతం సోహెల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఈ నెల 30న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్, టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ కాగా ప్రేక్షకులను అక్కటుకుంటున్నాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గిర చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాడు సోహెల్. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ర్ తో కలిసి వెరైటీ ప్రమోషన్స్ కి తెర లేపాడు.

వైజాగ్ యూట్యూబ్ర్ అయిన మత్స్యకారుడు నానితో కలిసి నడి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అలా నడిసముద్రంలోకి వెళ్లిన తరువాత బోట్ చివరంచున నిలబడి ఫొటోకు పోజు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అదుపుతప్పి సముద్రంలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న మత్స్యకారుడు సముద్రలోకి దూకి సోహెల్ ని రక్షించాడు. ఈ క్రమంలో సోహెల్ కాలుకి గాయం కూడా అయ్యింది. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అంటున్నారు నెటిజెన్లు.