Bihar : గాలి వానకు కూలిపోయిన నిర్మాణంలో ఉన్న వంతెన

బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో కురిసిన గాలివానకు నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. బలమైన గాలులు, వర్షానికి నిర్మాణంలోఉన్న వంతెన కూలియింది.

Bihar : గాలి వానకు కూలిపోయిన నిర్మాణంలో ఉన్న వంతెన

Potion Of Under Construction Bridge Collapses Due To Thunderstorm In Bhagalpur

Bihar: బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో కురిసిన గాలివానకు నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. బలమైన గాలులు, వర్షానికి నిర్మాణంలోఉన్న వంతెన కూలియిన ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరుగలేదు. ఖగారియా, భాగల్‌పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. అగువానీ-సుల్తాన్‌గంజ్ బ్రిడ్జి నిర్మాణాన్ని సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా పరిగణిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం (ఏప్రిల్ 29, 2022) అర్థరాత్రి తర్వాత ఉరుములతో కూడిన గాలి వానకు నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కొంత భాగం కూలిపోయింది.

ఈ వంతెనకు 2014 ఫిబ్రవరి 23న సీఎం నితీశ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. నాటి నుంచి దీని నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌హెచ్‌ 31, 107లను కలుపుతూ 3,160 మీటర్ల పొడవైన ఈ వంతెనను రూ.1,710 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. టోల్ ప్లాజా, డాల్ఫిన్ వ్యూపాయింట్‌తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జీ సుల్తాన్‌గంజ్‌, ఖగారియా, సహర్సా, సుపాల్, మాధేపురాతోపాటు ఇతర జిల్లాల మధ్య దూరాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.