Opposition Meet: దేవదాస్ సినిమా డైలాగ్ రీమేక్ చేసి రాహుల్ గాంధీపై అదిరిపోయే సెటైర్ వేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు పైచేయిగా ఉండాలని, అక్కడ కాంగ్రెస్ పెద్దన్నలా వ్యవహరించకూడదని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని కేజ్రీవాల్ అన్నారు.

Rahul Gandhi
Rahul Gandhi as Devdas: శుక్రవారం జరగనున్న విపక్ష నేతల మెగా మీట్‌కు హాజరయ్యేందుకు పాట్నాకు చేరుకున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. కాగా, అమెరికా పర్యటన నుంచి భారత్‌కు వచ్చిన మరుసటి రోజే రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ పాట్నాలోని భారతీయ జనతా పార్టీ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పోస్టర్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు రాహుల్ గాంధీల చిత్రాలు వేసింది. రీల్ దేవదాస్ షారూఖ్ అయితే రియల్ దేవదాస్ రాహుల్ గాంధీ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
దేవదాస్ సినిమాలోని ఒక సీన్‌ను ఇందుకు ఉదహరిస్తూ గట్టి సెటైరే వేశారు. ఆ సినిమాలో దేవదాస్ క్యారెక్టర్ తన తల్లితో మాట్లాడుతూ ‘‘పారూనేమో మధ్యం వదిలేయమంటుంది, ఊరువాళ్లేమో పారూని వదిలేయమంటారు, ఇప్పుడు నువ్వేమో (తల్లి) ఇళ్లు వదిలేయమంటున్నావు.. ఒక రోజు వస్తుంది. అప్పడు అందరూ కలిసి ఈ లోకాన్నే వదిలేయమంటారు’’ అనే డైలాగ్ ఇప్పటికీ జనాల్లో నానుతుంది. అచ్చం దీనికి లాగే బీజేపీ స్పూఫ్ రూపొందించింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని కేజ్రీవాల్ అన్నారు.
Modi no.1: మళ్లీ మళ్లీ మోదీనే.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్‌గా ప్రధాని మోదీ
అలాగే బెంగాల్ రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ రెండు సందర్భాల్ని ఉదహరిస్తూ ‘‘మమతా దీదీ బెంగాల్‌ను విడిచిపెట్టమనన్నారు.. ఢిల్లీ, పంజాబ్‌లను విడిచిపెట్టమని కేజ్రీవాల్ అన్నారు.. లాలూ-నితీష్‌లు బీహార్‌ను విడిచిపెట్టమన్నారు.. ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టాలని అఖిలేష్ అన్నారు.. తమిళనాడును విడిచిపెట్టాలని స్టాలిన్ అన్నారు.. రాజకీయాలను విడిచిపెట్టమని అందరూ చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని రాసుకొచ్చారు. పైన షారూఖ్ ఫొటో, కింద రాహుల్ ఫొటో వేసి.. వారి పక్కన ఈ రెండు డైలాగులు రాసుకొచ్చారు.
#WATCH | Posters taking a jibe at the Opposition unity, portraying Congress leader Rahul Gandhi as ‘Devdas of real life’, put up outside the BJP office in Patna, Bihar. pic.twitter.com/23eHdw8D9o
— ANI (@ANI) June 23, 2023
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు పైచేయిగా ఉండాలని, అక్కడ కాంగ్రెస్ పెద్దన్నలా వ్యవహరించకూడదని అన్నారు. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌కు గట్టి పోటీదారు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ కోసం కేంద్రం ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షాల నుంచి వాకౌట్ చేస్తుందని కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు.