Farmer Slaps Bjp MLA : యూపీలో BJP MLA చెంప ఛెళ్లుమనిపించిన రైతు..

యూపీలో ఎన్నికలు జరుగనున్నక్రమంలో ఓషాకింగ్ ఘటన జరిగింది. BJP MLA చెంప ఛెళ్లుమనిపించాడు ఓ రైతు..స్టేజ్ మీదకు వచ్చి ఎమ్మెల్యేను కొట్టిన ఘటన వైరల్ అవుతోంది.

Farmer Slaps Bjp MLA : యూపీలో BJP MLA చెంప ఛెళ్లుమనిపించిన రైతు..

Bjp Mla Pankaj Gupta Slapped

Updated On : January 8, 2022 / 2:59 PM IST

Farmer Slaps Bjp MLA:యూపీలో ఓ రైతు ఏకంగా ఓ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న క్రమంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన రైతు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రతిపక్షాలకు చక్కటి మేత అందించినట్లైంది. ఈ ఘటన రాజకీయ రంగు పలుముకుని తెగ వైరల్ అవుతోంది. కానీ ఈ ఘటనలో ఓ ట్విస్ట్ కూడా ఉంది. అసలు ఎవరా రైతు..ఎమ్మెల్యేను ఎందుకు కొట్టాడంటే..

కానీ అంతలోనే ట్విస్టిచ్చారు ఆ ఎమ్మెల్యే, ఆ రైతు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చి తమదైన రీతిలో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. యూపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఘటన రాజకీయ రంగు పలుముకుంది.

ఓ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా చెంప చెళ్లుమనిపించాడు ఓ రైతు నాయకుడు. ఎమ్మెల్యే వేదికపై ఉండగా వేదికపైకెక్కిన రైతు అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురైయ్యారు. అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు సదరు రైతుని నెట్టుకుంటు స్టేజ్ కిందకు దింపేశారు. కానీ వెంటనే సదరు ఎమ్మెల్యే మరో షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పంకజ్ గుప్తా..సదరు రైతు ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు.

నేను ఎమ్మెల్యేను కోపంతో కొట్టలేదని..దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని కేవలం అభిమానంతోనే ఎమ్మెల్యేను కొట్టానంటూ చెప్పుకొచ్చాడు సదరు ఆ రైతు నాయకుడు. అలాగే ఎమ్మెల్యే కూడా ఆ రైతు నేత నాకు తండ్రిలాంటి వాడని..అతనంటే నాకు ఎంతో అభిమానం అని..గతంలో కూడా అతను నాపై ఇటువంటి అభిమానమే చూపించారంటూ చెప్పుకొచ్చారు.

కానీ వీరి మాటలు నిజం కాదని ఎన్నికలు జరుగనున్న క్రమంలోబీజేపీ రాజకీయ ఎత్తుగడలో ఇదొక భాగమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరదు రైతు ఎమ్మెల్యేని కోపంతో కొట్టినా..అభిమానంతో కొట్టినా..ఆ ఎమ్మెల్యే పైపై మాటలతో మభ్యపెట్టాలని మాట్లాడినాగానీ..మొత్తానికి ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాజ్‌వాది.. ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను రైతు కొట్టిన చెంపదెబ్బ ఆఎమ్మెల్యేకు కాదని..బీజేపీ యోగి ఆదిత్యనాథ్ సర్కారుకని విమర్శించింది. యోగీ సర్కారుపై రైతుల్లో నెలకొన్న ఆగ్రహానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.