BJP: నేడు, రేపు ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు ఉంటుందా?

ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు ఉంటుందా? అనే దానిపై స్పష్టతరానుంది. నడ్డా పదవీ కాలాన్ని 2024 లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు పొడిగించే అవకాశం ఉంది.

BJP: నేడు, రేపు ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు ఉంటుందా?

BJP: ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు ఉంటుందా? అనే దానిపై స్పష్టతరానుంది. నడ్డా పదవీ కాలాన్ని 2024 లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు పొడిగించే అవకాశం ఉంది.

బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా మూడేళ్ల పదవీ కాలం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, పార్లమెంటు ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలు, తీర్మానాలకు బీజేపీ ఆమోదం తెలపనుంది.

సమావేశ ప్రారంభానికి ముందు పటేల్ చౌక్ నుంచి ఎన్ఎండీసీ వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.

కాగా, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు వేసుకుంది. 3,000-3500 మంది విస్తారక్ లను దేశంలోని పలు ప్రాంతాలకు పంపుతోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ బీజేపీ విస్తారక్ లను నియమించింది. త్రిపుర, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయా, నాగాలాండ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లో ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి.
DMK leader Kanimozhi: మా రాష్ట్రాన్ని ఏమని పిలవాలో మాకు చెప్పొద్దు: డీఎంకే నాయకురాలు కనిమొళి