Geetha Basraa : నాకు రెండు సార్లు గర్భస్రావం అయింది.. బాలీవుడ్ మాజీ నటి

వివాహం తర్వాత గీతా బస్రా ఒక సినిమా చేసింది. ఆ తర్వాత 2016 లో తల్లి కావడంతో సినిమాలకి దూరం అయింది. 2016 లో గీత మొదటి సారి ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు

Geetha Basraa :  నాకు రెండు సార్లు గర్భస్రావం అయింది.. బాలీవుడ్ మాజీ నటి

Geetha

Geetha Basraa :  భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 2015 లో బాలీవుడ్ హీరోయిన్ గీతా బస్రాని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత గీతా బస్రా ఒక సినిమా చేసింది. ఆ తర్వాత 2016 లో తల్లి కావడంతో సినిమాలకి దూరం అయింది. 2016 లో గీత మొదటి సారి ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. ఇటీవల మళ్ళీ 2021 లో గీతా బస్రా హర్భజన్ లకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి జోవన్‌ వీర్‌ సింగ్‌ ప్లాహా అనే పేరు పెట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు ఈ దంపతులు.

అయితే ఇటీవల గీతా మరో విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. బాబు పుట్ట‌డానికి ముందు నాకు రెండు సార్లు గ‌ర్భ‌స్రావం అయిందని తెలిపింది. దీనికి సంబంధించి ఒక ఎమోషనల్ పోస్ట్ ని కూడా పెట్టింది. ప్ర‌తి మ‌హిళ ప్రెగ్నెంట్ అని తెలిసిన‌ప్ప‌టి నుండి చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్లకు పుట్టబోయే పిల్లల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. కాని అలాంటి టైంలో మిస్‌ క్యారేజ్‌(గర్భస్రావం) జరిగితే తమ మొత్తం జీవితమే ​కోల్పోయినట్లు అనిపిస్తుంది. నా స్నేహితులతో పాటు నేను కూడా దీన్ని అనుభ‌వించాను. హీర్ పుట్టాక రెండు సార్లు గ‌ర్భ‌స్రావం అయింది. ఆ
సమయంలో నేను డిప్రెష‌న్‌ లోకి వెళ్లాను. కానీ నా భ‌ర్త నా పక్కనే ఉండి నన్నెంతో బాగా చూసుకున్నాడు. నా భర్త ఉండటం వల్లే నేను తొందరగా కోలుకోగలిగాను. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది వాళ్ల జీవితం చాలా బాగుంటది అని, కానీ సెలబ్రిటీల జీవితం అంత సులభం కాదు అని తెలిపింది.

అంతే కాక అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు అస్సలు ధైర్యాన్ని కోల్పోకూడ‌దు అని తెలియ‌జేసేందుకు నేను ఈ విష‌యం చెబుతున్నాను. ఎంతో మంది మ‌హిళలు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు.వారికి నా ఈ అనుభ‌వం తెలియచేయడం ఎంతో మంచిదని గీతా బస్రా తెలిపింది.