Rohit Shetty : హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ గాయపడ్డ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
డైరెక్టర్ రోహిత్ శెట్టి యూనిట్ తో హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఈ సిరీస్ షూట్ లో భాగంగా ఓ చేజింగ్ సీన్ చేస్తుంటే రోహిత్ శెట్టి గాయపడినట్టు సమాచారం. ఈ సిరీస్ కి రోహిత్ శెట్టి స్టంట్ మాస్టర్ గా కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ చేజింగ్ సీన్ చేస్తుండగా నేడు ఉదయం రోహిత్ శెట్టి గాయపడినట్టు సమాచారం...........

Bollywood director Rohit Shetty injured in Shooting at Hyderabad
Rohit Shetty : బాలీవుడ్ లో ఎన్నో మాస్ సినిమాలు, యాక్షన్, కామెడీ సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శెట్టి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ సినిమా రిలీజయింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ కోసం తెరకెక్కిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దీంతో డైరెక్టర్ రోహిత్ శెట్టి యూనిట్ తో హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఈ సిరీస్ షూట్ లో భాగంగా ఓ చేజింగ్ సీన్ చేస్తుంటే రోహిత్ శెట్టి గాయపడినట్టు సమాచారం. ఈ సిరీస్ కి రోహిత్ శెట్టి స్టంట్ మాస్టర్ గా కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ చేజింగ్ సీన్ చేస్తుండగా నేడు ఉదయం రోహిత్ శెట్టి గాయపడినట్టు సమాచారం.
Pathan Censor Report : పఠాన్ సినిమాకి సెన్సార్ కట్స్.. సాంగ్ వివాదం ఎఫెక్ట్ గట్టిగానే పడింది..
వెంటనే రోహిత్ శెట్టిని దగ్గర్లోనే ఉన్న ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రమాదం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉన్నాడు అనేది ఇంకా తెలియలేదు.