RRR : ఒకప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు.. చరణ్ పై బాలీవుడ్ ప్రశంసలు

రామ్ చరణ్ 2013లోనే బాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. 2013లో 'జంజీర్' సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో..............

RRR : ఒకప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు.. చరణ్ పై బాలీవుడ్ ప్రశంసలు

Ram Charan

Ram Charan :  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూసిన వారంతా రాజమౌళి, తారక్, చరణ్ లని పొగుడుతున్నారు. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే బాలీవుడ్‌లో ఎక్కువగా రామ్ చరణ్ ని పొగుడుతున్నారు. బాలీవుడ్‌లో రామ్ చరణ్ అంతకు ముందే ‘జంజీర్’ సినిమాతో పరిచయం.

 

ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటున్నారు, వేరే భాషల్లో సినిమాలు తీయాలి అనుకుంటున్నారు కానీ రామ్ చరణ్ 2013లోనే బాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. 2013లో ‘జంజీర్’ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాని రిఫరెన్స్‌గా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా మిగిలింది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’పై పలువురు సెలబ్రిటీల ట్వీట్లు

దీంతో రామ చరణ్‌ని బాలీవుడ్ మొత్తం విమర్శించింది. ఒక లెజెండరీ సినిమాని చెడగొట్టాడు అని, అసలు ఇతను హీరోనా అని, మొహంలో ఎక్స్‌ప్రెషన్ పలకలేదు అని, చిరంజీవి కొడుకు అయితే హీరో ఐపోతాడా అని.. ఇలా బాలీవుడ్ ప్రేక్షకులు, క్రిటిక్స్, సినీ వర్గాలు రామ్ చరణ్‌ని తీవ్రంగా విమర్శించాయి. ఆ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ బాలీవుడ్ లో సినిమా చేయలేదు. కానీ సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మళ్ళీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్.

RRR : మాస్టర్ పీస్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’పై మెగాస్టార్ ట్వీట్

అయితే ఇప్పుడు ఎవరెవరైతే తనని విమర్శించారో వాళ్లతోనే గొప్ప నటుడు అనిపించుకున్నాడు చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు, క్రిటిక్స్ అంతా రామ్ చరణ్‌ని, అతని నటనని పొగుడుతున్నారు. జంజీర్‌కు ఇప్పటికీ రామ్ చరణ్ నటనలో చాలా మార్పు వచ్చిందని, సినిమాకు ఆయన నటన హైలైట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు రామ్ చరణ్‌ని విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు చెర్రీని ఆకాశానికెత్తేస్తున్నారు. మనల్ని పొగిడే వాళ్లు కాదు, తిట్టే వాళ్లు కూడా పొగిడినపుడే అసలైన విజయం సాధించినట్లు అన్నదాన్ని చరణ్ రుజువు చేశాడు. తనని విమర్శించిన వారందరికీ మళ్ళీ తన నటనతోనే సమాధానమిచ్చాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌కి బాలీవుడ్‌లో గ్రాఫ్ పెరగడమే కాదు డైరెక్ట్ బాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.