RRR : మాస్టర్ పీస్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’పై మెగాస్టార్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి AMB సినిమాస్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసి దానిపై ట్వీట్ చేశారు. చిరంజీవి ట్విట్టర్ లో.. ''ఆర్ఆర్ఆర్ అనేది మాస్టర్ స్టోరీటెల్లర్ యొక్క మాస్టర్ పీస్. దర్శకుడు......

RRR : మాస్టర్ పీస్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’పై మెగాస్టార్ ట్వీట్

Rrr

 

Megastar :  రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అభిమానులు, ప్రేక్షకుల హంగామా మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు సినిమాపై, రాజమౌళి, తారక్, చెర్రీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా హిట్ అయినందుకు అభిమానులు ర్యాలీలు, సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఇక సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు ‘ఆర్ఆర్ఆర్’పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

RRR : ప్రేక్షకులకు, అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్

మెగాస్టార్ చిరంజీవి AMB సినిమాస్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి దానిపై ట్వీట్ చేశారు. చిరంజీవి ట్విట్టర్ లో.. ”ఆర్ఆర్ఆర్ అనేది మాస్టర్ స్టోరీటెల్లర్ యొక్క మాస్టర్ పీస్. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యొక్క అసమానమైన సినిమా విజన్‌కి ఒక గ్లోయింగ్ & మైండ్ బ్లోయింగ్ సాక్ష్యం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్” అంటూ ట్వీట్ చేశారు. పలువురు అభిమానులు, నెటిజన్లు ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.