T20 Blast 2023: అయ్యయ్యో.. ఇలా ఔట్ అయ్యాడేంటి! ఇలాంటి క్యాచ్ మీరెప్పుడైనా చూశారా? వీడియో వైరల్

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న T20 బ్లాస్ట్ లీగ్‌లో టింగ్‌హామ్‌షైర్‌, లీసెస్టర్‌షైర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

T20 Blast 2023: అయ్యయ్యో.. ఇలా ఔట్ అయ్యాడేంటి! ఇలాంటి క్యాచ్ మీరెప్పుడైనా చూశారా? వీడియో వైరల్

T20 Blast 2023

Updated On : June 22, 2023 / 12:20 PM IST

Viral Video: క్రికెట్‌లో ఫీల్డర్లు చేసే విన్యాసాలు ఒక్కోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బ్యాట్స్‌మెన్ కొట్టిన బాల్‌ను క్యాచ్ తీసుకొనే క్రమంలో గాల్లోకి ఎగిమరీ అందుకోవటం మనం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి బ్యాటర్ కొట్టిన బంతిని బౌలరే డ్రైవ్ చేసి అందుకుంటాడు. క్రికెట్‌లో అలాంటి క్యాచ్‌లు నిత్యం మనం చూస్తేనే ఉంటాం. కానీ, కొన్ని మ్యాచ్‌లలో ఊహించని తరహాలో బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టాల్సి వస్తుంది. ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యయ్యో.. ఇలా కూడా ఔట్ అవుతారా? పాపం బ్యాట్స్‌మెన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Kashmir Willow Bats : కశ్మీర్ విల్లో బ్యాట్లకు పెరిగిన డిమాండ్.. తొలిసారి వన్డే వరల్డ్ కప్‌లోకి ఎంట్రీ..! ఒక్కో బ్యాట్ ధర ఎంతంటే?

ఇంగ్లాండ్‌లో టీ20 బ్లాస్ట్ లీగ్‌లో నాటింగ్‌హోమ్‌షైర్, లీసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ని నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ స్టీవెన్ ముల్లానీ వేశాడు. తొలి బంతిని లిసెస్టర్‌షైర్ కెప్టెన్ కోలిన్ అకెర్మాన్ స్ట్రైట్‌గా కొట్టాడు. ఆ బాల్ నేరుగా బౌలర్ ముల్లానీ చేతిలోకి వెళ్లింది. అయితే, ముల్లానీ ఆ బాల్‌ను సరిగా అందుకోలేకపోవడంతో బాల్ కాస్త చేతిలోనుంచి గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్ పరుగుకోసం ముందుకు కదిలాడు. గాల్లోకి ఎగిరిన బాల్ కాస్త అతనికి తగిలి మళ్లీ బౌలర్ చేతిలోకి వచ్చి పడింది.

India tour of West Indies : వెస్టిండీస్ క‌ష్టాలు.. టెస్టు సిరీస్‌ను రీ షెడ్యూల్ చేస్తారా..?

బౌలర్ చేతినుంచి మిస్ అయిన క్యాచ్ నాన్ స్ట్రైకర్‌లో ఉన్నబ్యాటర్ కారణంగా మళ్లీ బౌలర్ చేతిలోకి రావడంతో అకెర్మాన్‌కు చిర్రెత్తుకొచ్చింది. నాన్ స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్ వైపు కొద్దిసేపు కోపంగా అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అయ్యయ్యో భలే పనైందే.. ఇదికూడా అద్భుతమైన క్యాచే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. బ్యాట్స్‌మెన్‌ను బ్యాట్స్‌మెనే ఔట్ చేయడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియోలో చూడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Vitality Blast (@vitalityblast)